NBK 108 : శ్రీ లీలా వచ్చింది, కాజల్‌ వచ్చేది ఎప్పుడో?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాల తర్వాత బాలకృష్ణ నుండి రాబోతున్న సినిమా ఆవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Balakrishna And Sreeleela Join For Nbk 108 Movie Shooting-TeluguStop.com

ఈ సినిమా లో బాలకృష్ణ ఆరు పదుల వయసు ఉండే పాత్రలో కనిపించబోతున్నట్లుగా గత కొన్ని రోజులకు ప్రచారం జరుగుతుంది.అంతే కాకుండా ఒక హీరోయిన్ బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించబోతుందని ప్రచారం కూడా జరిగింది.

నిన్న మొన్నటి వరకు అభిమానులందరూ కూడా సినిమా అప్డేట్ కోసం ఎదురు చూశారు.ఎట్టకేలకు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమే అన్నట్లుగా శ్రీ లీలా ఈ సినిమా లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లుగా కన్ఫర్మ్ అయింది.

నిన్నటి నుండి చిత్రీకరణలో శ్రీ లీలా పాల్గొంటుంది.దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాన్ని అధికారికంగా ఫోటో ని విడుదల చేసి మరీ వెల్లడించాడు.బాలకృష్ణ మరియు శ్రీ లీలా కాంబినేషన్ లో ఉండే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు చెబుతున్నాడు.తప్పకుండా ఈ సినిమా నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు అలరించే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

శ్రీ లీలా షూటింగ్ లో జాయిన్‌ అయింది.ఇక హీరోయిన్ గా నటించబోతున్న కాజల్ అగర్వాల్ ఎప్పుడు బాలకృష్ణ కు జోడిగా చిత్ర షూటింగ్ లో జాయిన్ అవ్వబోతోంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ మరియు శ్రీ లీలా కాంబినేషన్స్ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.అని అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరంలోనే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ను తీసుకు వచ్చే అవకాశం ఉంది.

ఉగాది కానకగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్‌ లుక్‌ లను చేస్తే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube