తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే మోదీ కంటే ముందు ఈడీ రాష్ట్రానికి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.కావాలనే ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ వేధింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.
కేంద్రం ఆదేశాలతోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను టార్గెట్ చేసి వేరు వేరు కేసుల్లో వేధించాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు.ప్రజల కోసం పని చేస్తానన్న ఆమె భయపడేది లేదని చెప్పారు.
మోదీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.కొందరి ప్రయోజనాల కోసమే మోదీ పని చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలపై పెరుగుతున్న భారాలు మోదీకి తగిన బుద్ధి చెబుతాయని పేర్కొన్నారు.తాము విచారణను ఎదుర్కొంటున్నామన్న కవిత మీరు ఎదుర్కోవాలని చెప్పారు.
ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్ తెలంగాణ సిట్ ముందుకు రావాలని మోదీ చెప్పాలని వెల్లడించారు.బీఆర్ఎస్సే బీజేపీకి ప్రత్యామ్నయం అవుతుందని కవిత స్పష్టం చేశారు.