తారకరత్న పెద్దకర్మలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను బాలయ్య అవమానించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లేచి నిలబడినా బాలయ్య వాళ్లను కనీసం పలకరించలేదు.బాలయ్య ఎందుకలా చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోల విషయంలో బాలయ్య అభిమానులు సైతం ఫీలవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను పణంగా పెట్టి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నా ఆయనకు అవమానాలే ఎదురవుతున్నాయని తారక్ కు తోడుగా ఉండటంతో కళ్యాణ్ రామ్ కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే కొంతమంది మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను బాలయ్య పలకరించి ఉండవచ్చని అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండా స్పందించడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎలాంటి తప్పు చేయని తారక్ విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్ల తారక్ కు వచ్చిన నష్టం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేసుకుంటే నందమూరి కుటుంబానికి, టీడీపీకి నష్టం అని తారక్ కు అంతకంతకూ క్రేజ్ పెరుగుతూనే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య తారక్ మధ్య ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా అలా జరగడం సాధ్యం కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి కనిపిస్తే మాత్రమే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.నందమూరి కుటుంబం గురించి నెగిటివ్ వార్తలు ప్రచారంలోకి రాకుండా బాలయ్య, ఎన్టీఆర్ అడుగులు వేయాల్సి ఉంది.