నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రయత్నం చేశారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ఆప్ నేతలు ఆందోళనకు దిగారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆప్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.