ఏసీ గురించి విన్నాము గాని, ఎగిరే ఏసీ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇంట్లో ఏసీని అమర్చుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు.ఎన్నో అవస్థలు పడితేగాని కోరుకున్న గదిలో ఏసీని అమర్చుకోలేం.
అయితే మిగిలిన గదుల్లో పరిస్థితి ఏమిటి? అన్ని ఏసీలు అమర్చుకుంటే ఇక అంతేసంగతి.అయితే ఇపుడు అలాంటి బాధలు లేకుండానే ఇల్లంతటికీ ఏసీ వాతావరణాన్ని పంచేందుకు ఇటలీకి చెందిన ‘మిరే ఓబ్లెమ్-ఈఆర్’ డ్రోన్ ఏసీని రూపొందించింది.అవును… దీనిని ఆన్ చేయగానే, ఇది గాల్లో చక్కర్లు కొడుతూ ఇల్లంతా తిరుగుతుంది.ఇంట్లోని మనుషుల శరీర ఉష్ణోగ్రతను పసిగట్టి, అందుకు అనుగుణంగా గదిలోని ఉష్ణోగ్రతను వెచ్చబరచడం లేదా చల్లబరచడం క్షణాల్లో చేసేస్తోంది.
సూపర్ ఐడియా కదూ.ఇలాంటి ఐడియా మాకెందుకు రాదు అనే అనుమానం వస్తుంది కదూ! ఈ డ్రోన్ ఇంట్లోని ప్రతి గదిలోనూ ఉష్ణోగ్రతలను అవసరానికి అనుగుణంగా రెగ్యులేట్ చేస్తుంది.అలాగే, ఇందులోని ‘అరోమా డిఫ్యూజర్’లో మనకు నచ్చిన సెంటును నింపి పెట్టుకుంటే, ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా, సువాసనలు వెదజల్లేలాగా చేసేస్తుంది.అయితే మార్కెట్లోకి త్వరలోనే విడుదల కానున్న ఈ డ్రోన్ ఏసీ ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
అలాగే దీని ఫీచర్ల గురించి కూడా కంపెనీ పూర్తిగా వివరించలేదు.అయితే ఈ ఐడియాను చాలామంది మాత్రం మెచ్చుకుంటున్నారు.ఇంకా అనేకమంది ఔత్సాహికులు ఇది విడుదల కాకమునుపే ముందుగా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు.ఇంకొందరైతే డ్రోన్ తో ఏసీ ఎలా సాధ్యం అబ్బా? అని తలలు గోక్కుంటున్నారు? అయినా ఈ స్మార్ట్ యుగంలో వీలుకానిది ఏముంటుంది చెప్పండి?
.