ఆర్థిక అక్షరాస్యత పై ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13 నుండి 17 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బ్యానర్లు, పోస్టర్లను అన్ని బ్యాంకుల బ్రాంచుల్లో, శిక్షణా కేంద్రాల్లో ప్రదర్శించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.