కియారా కపుల్ కు ‘RC15’ టీమ్ బెస్ట్ విషెష్.. సంతోషంగా ఉండాలంటూ..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో కియారా అద్వానీ ఒకరు.ఈమె బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది.

 కియారా కపుల్ కు ‘rc15’ టీమ్ బె-TeluguStop.com

అందుకే కియారా అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం.ఈమె మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే చరణ్ వినయ విధేయ రామ సినిమాలో అవకాశం లభించింది.

అయితే ఈ సినిమాతో కియారా ప్లాప్ అందుకుంది.

దీంతో ఈమె చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చరణ్ సినిమాలోనే అవకాశం అందుకుంది.రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15’.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉండగా ఈమె తాజాగా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.కియారా అద్వానీ – మల్హోత్రా పెళ్లి ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రాజస్థాన్ లో జరిగింది.అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి బాలీవుడ్ అగ్ర తారలు అంతా విచ్చేసారు.ఇక తాజాగా వివాహ రెసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది.ఈ క్రమంలోనే RC15 టీమ్ కూడా తమ హీరోయిన్ కు బెస్ట్ విషెష్ చెప్పారు.

చిన్న వీడియో షేర్ చేస్తూ కియారా కపుల్ కు బెస్ట్ విషెష్ అందించారు.వీరి వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నెట్టింట పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది.ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఇప్పటికే షూట్ చివరి దశకు చేరుకుంది.ప్రెజెంట్ సెట్స్ లో ఉన్న వారంతా శంకర్, రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు సహా మొత్తం టీమ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ వీడియోను షేర్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube