మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు.ఈయన నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇలా నాగబాబు సినిమా విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంత బిజీగా మారిపోయారు.ఇలా సినిమాలలోను రాజకీయాలలోని ఎంతో బిజీగా ఉన్నటువంటి నాగబాబు తాజాగా సినీ విమర్శకుల గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే నాగబాబు ట్విట్టర్ వేదికగా సినీ విమర్శకుల గురించి మాట్లాడుతూ… చాలామంది సినిమాలు చూసి ఎంతోమంది చెడిపోతున్నారని అనుకుంటున్నారు.సినిమాలు చూసి చెడిపోయిన వారు , సినిమాలలో మంచి చూసి బాగుపడాలి కదా అని ప్రశ్నించారు.సినిమాలు ఎప్పుడూ కూడా ఒకరు బాగుపడాలని ఒకరు చెడిపోవాలని చేయరు అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నారు.సినిమా అనేది ఒక వ్యాపారం మాత్రమే.ఇలా సినిమాలు చూసి చెడిపోతున్నారని మాట్లాడే ఎదవలకు ఇదే నేను చెప్పే సమాధానం.
సినిమాలలో ఏదైనా హింస లేదా కొన్ని సన్నివేశాలు ఓవర్ గా ఉంటే సెన్సార్ ఉంది తప్పనిసరిగా అలాంటి సన్నివేశాలను తొలగిస్తారు.సినిమాలను కేవలం వినోదం కోసం మాత్రమే చేస్తారు.ఇది ఒక వ్యాపారం మాత్రమే సినిమాలు చూసి చెడిపోతున్నారని కూసే కుహనా మేధావులు ఏడవకండి అంటూ ఈయన వరుసగా ట్వీట్లుచేశారు.
ప్రస్తుతం నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ… నిజమే అంటూ నాగబాబు చేసిన ట్వీట్లను షేర్ చేశారు.