పోస్ట్ డెలివరీ వీడియోపై అలాంటి కామెంట్లు.. శివబాలాజీ భార్య షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ సీజన్1 విన్నర్ శివబాలాజీ భార్య మధుమిత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఒక ఇంటర్వ్యూలో శివబాలాజీ మధుమిత మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

 Shivabalaji Wife Shocking Comments About Post Delivery Video Details Here Goes-TeluguStop.com

మధుమిత మాట్లాడుతూ పదో తరగతి వరకు నేను హాస్టల్ లోనే ఉన్నానని పేర్కొన్నారు.ఇంటర్ నుంచి కుకింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందని అన్నయ్య దగ్గరినుంచి వంట నేర్చుకున్నానని ఆమె తెలిపారు.

మా అన్నకు నాకు 4 సంవత్సరాల గ్యాప్ ఉందని మధుమిత అన్నారు.మా అన్న రూమ్ లో ఉన్న సమయంలో కుకింగ్ నేర్చుకున్నాడని ఆమె తెలిపారు.పెళ్లి తర్వాత నాన్ వెజ్ నేర్చుకున్నానని మధుమిత చెప్పుకొచ్చారు.నేను ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ మీద కూడా వీడియో చేశానని చేసే సమయంలో కొంచెం అన్ కంఫర్టబుల్ గా ఉండిందని సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేయడం అంటే మహిళకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పాల్సి ఉంటుందని మధుమిత తెలిపారు.

Telugu Bigg Boss, Madhumita, Madhumitha, Delivery, Shivabalaji, Tollywood, Youtu

ఆ వీడియో చూసి గర్భవతులు అయిన తమ వాళ్లకు ఏం చేయాలో అర్థమైందని కామెంట్లు వచ్చాయని మధుమిత అన్నారు.ఏం చేసినా అందరికీ ఉపయోగపడాలని యూట్యూబ్ ఛానల్ ఆలోచన తనదేనని మధుమిత పేర్కొన్నారు.కానెప్ట్స్ విషయంలో నేను జోక్యం చేసుకునేవాడినని శివబాలాజీ అన్నారు.చాలామంది నెటిజన్ల సూచనల మేరకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానని మధుమిత పేర్కొన్నారు.

Telugu Bigg Boss, Madhumita, Madhumitha, Delivery, Shivabalaji, Tollywood, Youtu

పిల్లలు అంటే అల్లరి లేకుండా ఉండదని అయితే పిల్లలు ఏదైనా మేము చెప్పేది వింటారని ఆమె అన్నారు.వాళ్లకు అర్థం అయ్యే విధంగా నేను చెబుతానని మధుమిత పేర్కొన్నారు.పెళ్లి తర్వాత మధుమిత పాత్రల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని శివబాలాజీ చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు కావాలని నేను కోరుకున్నానని మధుమిత కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube