వాష్ రూమ్ లోకి వెళ్లి గంటన్నర పాటు ఏడ్చాను... నాటు నాటు కొరియోగ్రాఫర్ కామెంట్స్ వైరల్!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుని ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు విదేశీయుల చేత కూడా ఈలలు వేయించాయి.

 Natu Natu Choreographer Prem Rakshit Emotional Comments Details, , Natu Natu-TeluguStop.com

ముఖ్యంగా ఈ సినిమాలో నాటు నాటు పాట అందరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.ఈ పాటకు గాను తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలోని ఈ పాట ఈ అవార్డును అందుకోవడంతో సినీ రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల కురిపించారు.ఇక ఈ పాట ఇలాంటి ఒక గొప్ప అవార్డును అందుకోవడంతో ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించినటువంటి ప్రేమ్ రక్షిత్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఈ పాటలో హుక్ స్టెప్స్ కోసం సుమారు 50 రకాల మూమెంట్స్ తయారు చేయగా ఈ మూమెంట్ రాజమౌళి గారికి నచ్చిందని తెలిపారు.

ఇక వీరిద్దరూ పర్ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీ టేకులు తీసుకున్నామని ప్రేమ్ రక్షిత్ తెలిపారు.ఈ పాట కోసం దాదాపు 20 రోజులపాటు హీరోలు రిహార్సల్స్ చేశారని ప్రేమ్ రక్షిత్ తెలిపారు.ఈ పాట కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని ఈ కష్టానికి తగిన ప్రతిఫలమే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అని ప్రేమ్ రక్షిత్ వెల్లడించారు.

అయితే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుందని తెలియడంతో నాకు ఏమి పాలు పోలేదని వాష్ రూమ్ లోకి వెళ్లి దాదాపు గంటన్నర పాటు ఏడ్చానని ఈ సందర్భంగా ప్రేమ్ రక్షిత్ నాటు నాటు పాట గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube