ఉదయ్ కిరణ్ , శ్రేయ చేయాల్సిన ఆనందం సినిమా ఎందుకు చేతులు మారింది ?

ఆనందం చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి మనందరికీ తెలిసిందే.ఈ చిత్రాన్ని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మాతగా తెరకెక్కించారు.

 Why Uday Kiran And Removed From Anandam Movie , Uday Kiran ,anandam , Tollywo-TeluguStop.com

ఈ జీవితానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా కేవలం రెండు కోట్ల వస్తే చాలు అని అనుకున్న తరుణంలో ఏకంగా దానికి ఐదు రేట్లు అంటే 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ఆ ఏడాది కి ఉత్తమ బ్లాక్ బాస్టర్ చిత్రంగా అవతరించింది.

ఇక ఈ సినిమా అటు శీను వైట్లకు కూడా మంచి బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచి స్టార్ డైరెక్టర్ గా అవతరించేలా చేసింది.

ఈ సినిమాలో ఆకాష్ హీరోగా నటించగా రేఖ హీరోయిన్ గా డెబ్యూ చేసింది.

అంతకుముందు ఈ సినిమాలో హీరోగా నటించిన ఆకాష్ కి ఇది రెండవ తెలుగు చిత్రం.తమిళ్లో ఒక సినిమా తీసి తెలుగులో రెండవ సినిమాగా ఆనందం సినిమా విడుదల కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు ఆకాష్ .ఇక రేఖ కూడా అప్పటికి కేవలం ఒక కన్నడ సినిమా మాత్రమే నటించింది.తర్వాత తెలుగులో ఆనందం సినిమా ద్వారానే డెబ్యూ చేసి సూపర్ క్రేజీ హీరోయిన్ గా మారింది.

కానీ వీరిద్దరూ కూడా తమ కెరియర్ ను ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోయారు.దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం వీరిద్దరూ సినిమాల నుంచి పూర్తిగా విరామం కూడా ప్రకటించారు.

Telugu Akash, Anandam, Ramoji Rao, Rekha, Shriya Saran, Tollywood, Uday Kiran, U

ఇక అసలు విషయంలోకి వెళితే హీరోగా ఆకాష్, హీరోయిన్ గా రేఖ ను తీసుకోవడానికి ముందు ఈ సినిమాలో అనుకున్న మెయిన్ లీడ్ యాక్టర్స్ పూర్తిగా వేరు.మొదట ఉదయ్ కిరణ్ హీరోగా శ్రీయాని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు చిత్ర బృందం.ఎందుకంటే శ్రియతో నాలుగు సినిమాల కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు రామోజీ రావు.కానీ ఆనందం సినిమాకి కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన శ్రీను వైట్ల రేఖను సీన్లోకి తీసుకొచ్చాడు.

అలా ఉదయ్ కిరణ్, శ్రీయ కాంబినేషన్ లో రావాల్సిన ఆనందం సినిమా ఆకాశ్, రేఖ కాంబినేషన్లో వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube