కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేరుతో ఏర్పాటైన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది.వీర ధరణి రెడ్డి పేరిట వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
కాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణి రెడ్డి.రాబోయే కాలానికి… కాబోయే ఎమ్మెల్యే వీర ధరణిరెడ్డి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఈ బ్యానర్ లో ధరణిరెడ్డికి ఇరువైపులా బాలకృష్ణ ఫొటోలు ఉన్నాయి.బాలయ్య నటించిన వీరహింహా రెడ్డి సినిమా ఫ్లెక్సీ తరహాలో ఏర్పాటు చేయడంపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.