దత్త తండ్రి.. దత్త పుత్రుడు ! ఏకిపారేసిన జగన్ 

తమ రాజకీయ ప్రధాని ప్రత్యర్థులుగా ప్రస్తుతం భావిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై సమయం దొరికినప్పుడల్లా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్  తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ.వారిపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు.

 Jagan Criticizes Pawan Kalyan Chandrababu In Narsipatnam Public Meeting Details,-TeluguStop.com

ఈ రెండు పార్టీల అధినేతలు ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకుని తమపై రాజకీయ యుద్దానికి దిగేందుకు  ప్రయత్నిస్తున్నారని పదేపదే జగన్ విమర్శలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా పూర్తిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కనుసనల్లో నడిచే వ్యక్తి అని,  ఆయన ఆదేశాల మేరకే ముందుకు వెళుతుంటారని జగన్ వ్యంగంగా విమర్శలు చేస్తూ ఉంటారు.

తాజాగా మరోసారి ఆ తరహా విమర్శలే చేశారు.ఈరోజు నర్సీపట్నంలో పర్యటించిన జగన్ అక్కడ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒక్క మంచి పని అయినా జరిగిందా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

అయినా దత్త తండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని పవన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.వారికి ఈ  రాష్ట్రం కాకుంటే మరో రాష్ట్రం , ఈ ప్రజలు కాకుంటే మరో ప్రజలు .ఈ భార్య కాకుంటే మరో భార్య అన్నదే వారి తీరని విమర్శించారు.

Telugu Ap Cm Jagan, Ap Tdp, Chandrababu, Jagan, Pawan Kalyan, Ysrcp-Political

ఏపీలో ఏ మంచి జరిగినా .తనవల్లేనని చంద్రబాబు చెప్పుకుంటారని,  సింధూకు బ్యాట్మెంటన్ కూడా తానే నేర్పానని చంద్రబాబు చెప్పుకుంటారని ఎద్దేవ చేశారు.రెవెన్యూ డివిజన్ కూడా పెట్టలేకపోయారని మండిపడ్డారు.

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు , మోసాలు మాత్రమేనని అన్ని వర్గాలను మోసం చేసిన బాబును ప్రజలు ఎందుకు నమ్ముతారు అంటూ జగన్ ప్రశ్నించారు.రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నామని,  ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని,  మంచి చేస్తున్న వారికి చెడే కనిపిస్తోందని విమర్శించారు.

 దుష్ట చతుష్టం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ,చంద్రబాబు , పవన్ అంటూ మండిపడ్డారు.

Telugu Ap Cm Jagan, Ap Tdp, Chandrababu, Jagan, Pawan Kalyan, Ysrcp-Political

మంచి చేస్తుంటే దుష్ట చతుష్టాయం దుష్ప్రచారం చేస్తోందని , పెన్షన్లపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మన రాష్ట్రానికి రావాల్సిన హోదాను ప్యాకేజీ కోసం చంద్రబాబు తాకట్టు పెట్టినందుకు చంద్రబాబు సభలకు జనం రావాలని ప్రశ్నించారు.ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేసినందుకు ఆయన సభలకు రావాలా అంటూ నిలదీశారు .అందరినీ మోసం చేశాక చంద్రబాబు సభకు ఎవరైనా వస్తారా అంటూ జగన్ ప్రశ్నించారు.చంద్రబాబు పాపంలో దత్తపుత్రుడు పవన్ కు కూడా వాటా ఉందని జగన్ ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube