టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన బాలకృష్ణ చిరంజీవిల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరూ ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే చాలాసార్లు ఒకేసారి సినిమాలు విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన ఈ ఇద్దరు హీరోలు మరొకసారి పోటీపడనున్నారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా, బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13, 12 రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని నందమూరి అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అంతేకాకుండా ఈ రెండు సినిమాల విషయంలో ఒకే విధంగా పాజిటివ్ టాక్ వినిపిస్తుండడంతో ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య సినిమాలోని అన్ని పాటలకు, అలాగే వీర సింహారెడ్డి సినిమాలోని రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ రెండు సినిమాల గురించి అలాగే ఆ ఇద్దరు హీరోల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలో ఒకేసారి సంక్రాంతి సమయంలోనే విడుదల అవుతాయని అనుకోలేదు.కాబట్టి ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులను కంపోజ్ చేసినప్పుడు పెద్దగా ఆందోళన పడలేదు.
కానీ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడంతో ఒకవైపు ఆందోళనగా మరొకవైపు సంతోషంగా ఉంది అని తెలిపారు.చిరంజీవి, బాలకృష్ణ గారిలో ఉన్న ఏకైక క్వాలిటీ ఏంటంటే వారి అంకితభావం,సమయపాలన.
ఏ డాన్స్ మూమెంట్ ని అయినా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసేంతవరకు రిలాక్స్ అవ్వరు అని చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్.కాగా ప్రస్తుతం శేఖర్ మాస్టర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా వరుసగా సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరొకవైపు నిర్మాతగా మారడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు శేఖర్ మాస్టర్.