బాలయ్య బాబు ప్రస్తుతం తన 107వ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు.ఇక 108వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు.
కెరియర్ తొలినాళ్ళ నుంచి బాలయ్య అన్ని రకాల జోనర్స్ లో నటిస్తూ వస్తున్నారు.ఆయనకు పౌరాణికమైన, చారిత్రకమైన, జానపదమన్నా, సాంఘికమైన కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాను ఎంతో గొప్పగా తీసి మంచి హిట్టు కొట్టారు.ఇక చాలామందికి తెలియని విషయమేమిటి అంటే ఆయన దాదాపు 42 ఏళ్ల క్రితమే ఒక హాలీవుడ్ తరహా సినిమాలో నటించారు.
అది 1980 దశకంలో వచ్చిన దేశోద్ధారకుడు చిత్రం.
ఇది విజయభాస్కర ఫిలిం ప్రొడక్షన్స్ వారు తెరకెక్కగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితమైంది.
ఇక కన్నడ దర్శకుడైన రవిచంద్రన్ మొదటిసారి ఈ చిత్రంతోనే తెలుగులో పరిచయం అయ్యారు.ఈ చిత్రంలో బాలయ్య సరసన విజయశాంతి కథానాయకి గా నటించగా చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమాకి ఎంతో హైలైట్ గా నిలిచింది.
గోపి అనే పాత్రలో బాలకృష్ణ నటించగా ఈ చిత్రంలో అల్లరి చిల్లరగా తిరిగే యువకుడి పాత్ర పోషించారు.అంతేకాదు ఊరిలో అన్యాయం జరిగితే ఎదిరించి దేశోద్ధారకుడిగా కీర్తించబడటమే ఈ చిత్రం యొక్క కథాంశం.
ఈ సినిమాలో మరొక విషయం ఏమిటి అంటే కథానుసారం నాటకాల్లో నటిస్తూ చత్రపతి శివాజీగా అలాగే సయోధనుడిగా కూడా కనిపించారు బాలయ్య బాబు.
హాలీవుడ్ లో ఎంతో గొప్ప దర్శకుడుగా పేరు ఉన్నటువంటి డేవిడ్ లీన్ తన చిత్రం అయిన ఏ ప్యాసేజ్ టు ఇండియా చిత్రంలో వాడినటువంటి ఒక రథాన్ని ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఇండియాకు రప్పించారు.ఇంకా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అద్భుతమైన విషయం ఏమిటి అంటే 1933లో వచ్చిన ఒక ఆస్టిన్ ఇంపార్టెంట్ మోడల్ కార్ ను కూడా ఇండియాకు రప్పించారు.ఇది అప్పట్లో ఎనిమిది సార్లు రేసులో గెలిచి రికార్డ్ సృష్టించింది.
ఇక ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన సత్యనారాయణ ఆ కారును వాడటం విశేషం.
ఎంతో భారీ ఖర్చుతో తీసిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమాలకు స్ఫూర్తిగా తీశారు.ముందుగా వంశోద్ధారకుడు అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నప్పటికీ దేశోద్ధారకుడు మార్చి 1986 ఆగస్టు 7న విడుదల చేయగా ఘనవిజయాన్ని అందుకుంది అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం 100 రోజులపాటు ఆడి సంచలనం సృష్టించగా విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద 108 అడుగుల భారీ కట్ అవుట్ కూడా అప్పట్లో ఫుల్ బజ్ క్రియేట్ చేసింది.