ప్యాలెస్ పిల్లి.. కాపీ క్యాట్ ! లోకేష్ పంచ్ లు 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్ అయ్యారు.జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ ప్రజల్లో తిరిగేందుకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

 Palace Cat.. Copy Cat ! Lokesh Punches ,nara Lokesh, Tdp, Ysrcp, Ap, Ap Governme-TeluguStop.com

త్వరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్న లోకేష్ సందర్భం వచ్చిన ప్రతిసారి వైసిపి ప్రభుత్వం పైన , జగన్ పైన తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ విమర్శలు చేస్తున్నారు.పార్టీలో తన గ్రాఫ్ పెంచుకునేందుకు జగన్ కు దీటైన నేతగా తన పేరు మారుమోగేలా లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటించారు.
  ” ఇదేం కర్మ మన రాష్ట్రానికి ” కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు.ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.మంగళగిరిలో పదివేల ఇళ్లు నిర్మిస్తామని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన జగన్ పై లోకేష్ విమర్శలు చేశారు .స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని తనపై ఆరోపణలు చేశారని, తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు.తాను జగన్ రెడ్డి లా పారిపోయే రకం కాదని, తనపై నిరాహార ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని లోకేష్ హెచ్చరించారు.ఈ ప్యాలస్ పిల్లి… కాఫీ క్యాట్ అని జగన్ ఉద్దేశించి లోకేష్ విమర్శలు చేశారు.

జయహో బీసీ సభ పేరు కూడా టిడిపి నుంచి కాపీ కొట్టారని , జగన్ రెడ్డి చుట్టూ ఉన్న నలుగురు రెడ్లకు బీసీలు అంటే నర నరాల్లో కోపం ఉందని, 24 మంది బీసీలను హత్య చేయించడమే జయహో బిసి నినాదమా అంటూ లోకేష్ ప్రశ్నించారు.
 

Telugu Ap, Copy Cat, Lokesh, Lokesh Punches, Pyales Pilli, Ysrcp-Political

టిడిపి డీఎన్ఏ అంటేనే బిసి,  బీసీల గుండెల్లో టిడిపి ఉంటుందని లోకేష్ వ్యాఖ్యానించారు.జగన్ బటన్ నొక్కితే చెత్త పన్ను పడిందని , నిత్యావసరాల ధరలు పెరిగాయని , జగన్ రెడ్డి బటన్ నొక్కితే సంక్షేమ సంక్షేమ పథకాలన్నీ గోవిందా గోవింద అయ్యాయని లోకేష్ కామెంట్స్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube