ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రకటన అని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు.ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలేవని చెప్పారు.
తెలంగాణలో శాంతి భద్రతలు లేవన్న ఆయన రాష్ట్రంలో ఏ గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ ముందు రైతుల రుణమాఫీ హామీ నెరవేర్చాలని తెలిపారు.
కేంద్ర పథకాలను కేసీఆర్ ప్రజలకు చేరనివ్వడం లేదని ఆరోపించారు.రైతుల సమస్యలను బీజేపీనే పరిష్కరిస్తుందని వెల్లడించారు.