చాలామంది ప్రజలు ఎంత సంపాదించినా కూడా ఎన్నో రకాల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎంత సంపాదించినా కూడా వారి చేతిలో డబ్బు నిలబడకుండా ఉంటుంది దీని వల్ల వారి కుటుంబ సభ్యులందరిలో ప్రశాంతత దూరమవుతుంది.
సంపాదించిన ధనం వారి చేతిలోకి వచ్చినట్లే వచ్చి దూరం అవుతూ ఉంటుంది.అయితే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం వారి ఇంటి పై ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే వారి ఇంట్లో సిరిసంపదలకు ఎప్పటికీ లోటు ఉండదు.అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శాస్త్రాలలో ఎన్నో రకాల విషయాలను వెల్లడించారు.
లక్ష్మీదేవి దీనివల్ల చాలామంది లక్ష్మీదేవిని సంతోష పెట్టడానికి అనేక రకాల కఠినమైన నియమాలను పాటిస్తూ ఉంటారు.
ఇలాంటి సమస్యలు ఉన్న వారి ఇంటి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే అలాగే ఇంట్లో సంపదలకు ఎటువంటి లోటు ఉండదు.
లక్ష్మీ దేవి అనుగ్రహం తమ ఇంటిపై ఉండాలి అనుకుంటే కొన్ని రకాల పరిహారాలు చేయవలసి ఉంటుంది.మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రేమ, శాంతి, ఆనందం ఉండే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.సుఖశాంతులతో నివసించే వారికి తప్పకుండా దేవి అనుగ్రహిస్తుంది.
అయితే ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించడం ఎంతో మంచిది.
ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజ చేయడం వల్ల ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆమెకు ఎంతో ఇష్టమైన తామర పువ్వును భక్తితో సమర్పించాలి.ఆ తర్వాత శ్రీ సూక్తిని పాటించడం ఎంతో మంచిది.
ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో డబ్బుకు ఎప్పుడు లోటు ఉండదు.అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి ముఖద్వారం వద్ద గంగాజలాన్ని చల్లి పసుపు కుంకుమతో ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును వేయడం కూడా ఎంతో మంచిది.
LATEST NEWS - TELUGU