సాధారణంగా మొసలి వద్దకు వెళ్లాలంటేనే చాలా భయమేస్తుంది.ఎందుకంటే ఇవి శరవేగంగా దాడి చేసి చేతులు, కాళ్లు క్షణాల్లోనే కరకరా నమిలేసి తినేయగలవు.
పైగా వీటికి బీభత్సమైన శక్తి ఉంటుంది.ఇవి సింహాలు, పులులతోపాటు ఏనుగులను కూడా నేలకూల్చగలవు.
అంతటి శక్తివంతమైన ఓ మొసలితో తాజాగా ఒక వ్యక్తి ఆటాడుకున్నాడు.అతడు మొసలి వేషం ధరించి నిజమైన మొసలితో పరాచకాలు ఆడాడు.
దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు ఓరి నాయనో ఇతడి గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియోలో ఒక నది ఒడ్డున పెద్ద మొసలి పడుకొని విశ్రాంతి తీసుకోవడం చూడవచ్చు.దాని పక్కనే ఒక వ్యక్తి మొసలిలాగా వేషం వేసుకొని పడుకున్నాడు.ఆ మొసలికి అతడు రెండు అడుగుల దూరంలోనే ఉన్నాడు.అంత దూరం నుంచే అతడు మొసలి వెనక కాలును పట్టుకొని లాగుతూ ఆటపట్టించాడు.
ఆ మొసలేమో చాలా ప్రశాంతంగా ఉంది.ఒకవేళ దానికి బాగా చిరాకేసి ఒక్కసారి వెనక్కి తిరిగేసి అతడిని తలను నోట కరుచుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది.
అతడి అదృష్టం కొద్దీ అలా జరగలేదు.

సాధారణంగా మొసలి, సింహం, పులి వంటి క్రూర జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు.ఒక్కోసారి అవి తమ యజమానుల పైనే దాడి చేసి చంపేస్తుంటాయి.అందుకే వీటితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
కానీ కొందరు వ్యక్తులు మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి కూడా అలానే ప్రవర్తించి చాలామందిని షాక్‌కి గురి చేశాడు.
కాగా ఇలాంటి మూర్ఖత్వపు సాహసాలు ఎప్పటికైనా ప్రాణాలను హరించేస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
ఈ వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి.








