Hamilton New Zealand: ఆస్ట్రేలియా : భారతీయులే టార్గెట్...వరుస దాడులతో ఆందోళనలో భారతీయులు..!!

ఆస్ట్రేలియా లో ఉంటున్న భారతీయులకు రక్షణ కరువయ్యింది.వరుసగా జరుగుతున్న దాడులతో భయాందోళనలకు లోనవుతున్నారు.

 Australia: Indians Are The Target Indians Are Worried About The Successive Attac-TeluguStop.com

కొద్ది రోజుల క్రితం భారత్ కు చెందిన జానక్ పటేల్ అనే వ్యక్తిపై దాడి జరిగిన ఘటన అందరికి తెలిసిందే ఆక్లాండ్ లో అతడు పనిచేసే ప్రాంతంలోనే అతడిని హత్య చేశారు.ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు కూడా.

ఈ పరిణామంతో అక్కడి భారతీయులు ఆందోళన చెందారు.ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది.

భారతీయులే టార్గెట్ అన్నట్టుగా న్యూజిలాండ్ లో ఉంటున్న భారత సంతతి వ్యక్తీ సిదు నరేష్ పై తాజాగా దాడికి తెగ బడ్డారు దుండగులు.న్యూజిల్యాండ్ లోని హామిల్టన్ లో ఓ స్టోర్ ను సొంతగా నడుపుతున్న నరేష్ పై దుండగులు విరుచుకు పడ్డారు.

ముసుగులు ధరించి అతడి స్టోర్ లోకి వచ్చిన దుండగులు నరేష్ పీకపై కత్తి పెట్టి బెదిరించారు.డబ్బు ఇవ్వాలంటూ స్టోర్ ను మొత్తం ధ్వంసం చేశారు, ఆ పై నరేష్ ను కత్తితో బెదిరిస్తూ డబ్బులు మొత్తం కాజేశారు.

ఈ క్రమంలో వారికి అడ్డుపడిన వ్యక్తిపై దాడి చేసి అక్కడి నుంచీ పారిపోయారు.కాగా.

Telugu Auckland, Australia, Hamilton, Indians, Janak Patel, Zealand, Sidhu Nares

దాడి చేసిన దుండగుల వయసు కేవలం 16 ఏళ్ళు లోపుల ఉంటుందని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు, భాదితులు.ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి అక్కడి సిసి కెమెరాలను పరిశీలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదిలాఉంటే భారతీయులపై వరుసగా దాడులు జరగడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆస్ట్రేలియా లోని భారతీయులు తమపై జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయని వాపోతున్నారు.

ప్రభుత్వం తమపై జరుగుతున్న దాడులను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube