తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పూజ హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమా అవకాశాలని అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే ఇటీవల పూజా హెగ్డే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా షూటింగ్ సమయంలో నటి పూజా హెగ్డేకు గాయమైన విషయం తెలిసిందే.
కాగా ఆ ప్రమాదంలో పూజ హెగ్డే కాలుకు బలమైన గాయం కావడం కావడంతో ప్రస్తుతం పూజా హెగ్డే ఇంటి పట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటోంది.
పూజా హెగ్డే ఎడమ కాలికి గాయం కావడంతో ఆమె ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పూజ హెగ్డే కి సంబంధించిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో పూజ హెగ్డే వాకర్ పట్టుకొని నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తోంది.పూజా నర్స్ సహాయంతో వాకర్ పట్టుకొని నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది.అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ నా జీవితంలో నేను రెండోసారి నడక నేర్చుకుంటున్నాను అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది పూజ హెగ్డే.
కాగా పూజ హెగ్డే ఇటీవలే బీస్ట్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాకు తో పాటు విడుదలైన ఆచార్య,రాధే శ్యామ్ సినిమాలు కూడా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ అయిన కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.మొన్నటి వరకు పూజ హెగ్డే ఐరన్ లెగ్ అంటూ వార్తలు వినిపించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ వార్తలు పై స్పందించలేదు.