తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోయిన్ తాప్సి ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ.ఆ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాలేక పోయినప్పటికీ హీరోయిన్ తాప్సికి మాత్రం మంచి గుర్తింపు దక్కింది.
ఆ తర్వాత ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.
అయితే ఆ సినిమా తర్వాత పలు సినిమాలలో తాప్సీకి నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలు ఆమె కెరియర్ కు ప్లస్ కాలేకపోగా అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిజస్టర్ లుగా నిలిచాయి.
తెలుగులో సినిమాలు అన్ని వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో ఆమె తెలుగు ఇండస్ట్రీపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసింది.బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సి వరుసగా సినిమా అవకాశాలను అందుకు దూసుకుపోతోంది.
అయితే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తాప్సీకూ బాగానే కలిసి వచ్చింది అని చెప్పవచ్చు.ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ ను సాధించాయి.
అయితే ఈ మధ్యకాలంలో తాప్సి గాడి తప్పింది అన్న అభిప్రాయాల వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే తాప్సీ నటించిన సినిమాలు అన్నీ కూడా ఓటీటీ బాట పడుతున్నాయి.
ఆమె నటించిన ఒకటి లేదా రెండు సినిమాలు థియేటర్లో విడుదల అయినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.దీంతో ఆమె కెరియర్ కష్టాల్లో పడింది అంటూ బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కాగా బాలీవుడ్ లో తాప్సి నటించిన హసీన్ దిల్రూబా సినిమా ఓటీటీలో విడుదల అయ్యి మంచి సక్సెస్ అవ్వడంతో తాప్సీ నటించిన సినిమాలు అన్ని వరుసగా ఓటీటీ బాట పట్టాయి.దాంతో తాప్సీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.మిషన్ ఇంపాజిబుల్, శభాష్ మిథు లాంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి పెద్దగా ప్రభావం చూపించలేక పోయాయి.దాంతో తాప్సీకి ఓటీటీ కాస్త కలిసొస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం బ్లర్ సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈసినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.ఈసినిమాలో నటించడంతో పాటు తాప్సీ నిర్మాతగా కూడా వ్యవహరించింది.
అయితే ఈ సినిమాను కూడా ఓటీటీ రిలీజ్ పైనే ఆధారపడినట్టు తెలుస్తోంది.తాప్సీకి ఓటీటీ కలిసి రావడంతో థియేటర్ వైపు వెళ్లకుండా బుల్లతెరనే నమ్ముకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.