ప్రస్తుత వింటర్ సీజన్ లో వివిధ రకాల అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలే కాదు జుట్టు సంబంధిత సమస్యల సైతం సతమతం చేస్తుంటాయి.ముఖ్యంగా జుట్టు రాలడం, పొడి బారడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లి పోవడం తదితర సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.
వాటి నుంచి ఉపశమనం పొందడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.అయితే వాటి నుంచి విముక్తి అందించడంలో ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది.
వింటర్ సీజన్ లో తప్పకుండా వేసుకోవాల్సిన హెయిర్ ప్యాక్ ఇది.మిస్ అయితే చాలా లాభాలను నష్టపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి పాలు పోసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జెల్ ను మిక్సీ జార్ లో వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు అరటి పండు ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.దాంతో హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.డ్రై హెయిర్ స్మూత్ గా మరియు షైనీ గా మారుతుంది.
జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి.