ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జీవరాశులు ఈ భూమిపై నివసిస్తున్నాయి.అన్ని జీవరాశులలో కాకి కూడా ఒకటి.
కానీ కాకి శని వాహనం కావడం వల్ల కాకిని చాలామంది ప్రజలు చెడుకు సంకేతంగా భావిస్తారు.అయితే శని దేవుడు ప్రజలందరికీ చెడును కలిగించే దేవుడు మాత్రం కాదు అని అందరూ తెలుసుకోవాలి.
శనికి వాహనంగా ఉండే కాకి కూడా శుభసూచకం కాదని భావించేవారు చాలామంది ఉన్నారు.అయితే ఇంటి వద్ద కాకి కొన్ని దిశలలో ఉండి అరవడం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కాకి కనిపిస్తే అరిస్తే, మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం ఆగ్నేయ దిశ నుంచి వచ్చే కాకి కనిపించినట్లయితే అది ధన లాభాన్ని సూచిస్తుందని చెబుతారు.
ఇక మనిషికి ఎడమ వైపు నుంచి కాకి వెళితే అది మంచి శుభ పరిణామంగా భావిస్తారు.ఇంటి ఎదురుగా కాకి అరుస్తూ ఉంటే ఆ ఇంటికి అనుకోని అతిధి ఎవరో వస్తున్నారని చెప్పవచ్చు.
సాయంత్రం వేళ కాకి నైరుతి దిశ నుంచి కనిపిస్తే అది ప్రమాదానికి సంకేతంగా భావించాలి.కాకి ఒక వ్యక్తి యొక్క మంచం మీద ఏదైనా కాలిన చెక్కను కానీ, మాంసం కానీ పడవేస్తే అది సమీప భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావిస్తారు.
దక్షిణం వైపు ముఖం పెట్టి కాకి అరుస్తుంటే కుటుంబ పెద్ద కు మంచి జరుగుతుందని చెప్పవచ్చు.ఒంటే పై కానీ, గాడిద పై కానీ కూర్చున్నట్లయితే అది శుభ సూచకంగా చెబుతున్నారు.కాకి ముక్కులో ఏదైనా మొక్కజొన్న గింజ ను కానీ, రాయి గాని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన లాభం కలిగే అవకాశం ఉంది.కాకి ఏదైనా వస్తువులు తీసుకు వెళితే అది ప్రమాదాన్ని సూచిస్తుంది.
పండ్ల చెట్టుపై కాకి కనిపిస్తే సంపద, గౌరవాన్ని పొందే అవకాశం ఉంది.