మనం ఇప్పుడు రోజు చూస్తున్న, రాస్తున్న కృష్ణ కు సంబందించిన అన్ని విషయాల్లో అతడి భార్యలు, పిల్లలు ఉన్నారు, ఉంటూనే ఉంటారు.కానీ అయన బ్యాచిలర్ లైఫ్ లో పెళ్లి కాక ముందు తోబుట్టువులతో, తల్లిదండ్రులతో ఉన్న విషయాలు పెద్దగా ఎవరికీ తెలియదు.
ఆ ఫొటోస్ కూడా ఎక్కడ కనిపించవు.ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో లో అయన పూర్తి కుటుంబం ఉంది.
బుర్రిపాలెం కి చెందిన కృష్ణ తండ్రి పేరు వీర రాఘవయ్య చౌదరి, తల్లి నాగరత్నమ్మ. అయనకు ఇద్దరు తమ్ముళ్లు , అది శేష గిరి రావు, హనుమంత రావు.
వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ కి సంబందించిన వారే.ఇక ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు.కృష్ణ సినిమాల్లోకి వచ్చి సెటిల్ అయ్యాక తమ్ముళ్లను మద్రాసు పిలిపించుకున్నాడు.తనతో పాటే పెట్టుకున్నాడు.
సినిమా నిర్మాణం పై పట్టు సాధించేలా చేసాడు.ఇక హైదరాబాద్ కి పరిశ్రమ తరలి వచ్చాక పద్మాలయ స్టూడియో కట్టి ఆ బాధ్యతలను తమ్ముళ్లకు అప్పగించాడు కృష్ణ.
ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలను నిర్మించేవారు.అన్న ఏం చెప్పిన తమ్ముళ్లకు అది ఆజ్ఞ లాంటిదే.
ఇక తల్లి కోరికగా ఆమె పేరు పై సొంత వూళ్ళో ఒక స్కూల్ ని కూడా కట్టించాడు కృష్ణ.ఆ స్కూల్ కి నాగరత్నమ్మ ప్రాథమిక ఉన్నత పాఠశాల అనే పేరు పట్టదు.తల్లి దండ్రుల పేర్లపై విడి విడిగా సినిమాలను నిర్మించాడు.జి.వి.ఆర్ అంటే ఘట్టమనేని వీర రాఘవయ్య పేరుతో ఒక బ్యానర్ స్థాపించి సినిమాలు తీయగా, అందులో శభాష్ గోపి అనే సినిమా చేసారు.
ఈ సినిమా కోసం హనుమంత రావు మరియు అది శేషగిరి రావు స్క్రీన్ ప్లే, రైటర్ గా పని చేస్తే టైటిల్ రోల్ ని కృష్ణ కుమార్తె మంజుల పోషించింది.తండ్రి నిర్మాణం లో నే కూతురు బాలనటిగా మొదటి సినిమాలో నటించడం అప్పట్లో కృష్ణ చాల గర్వపడిన సందర్భం.ఇక ఇప్పుడు ఎలా అయితే కృష్ణ కుటుంబం లో వరస మరణాలు జరుగుతున్నాయో అయన తల్లిదండ్రులు కూడా అలాగే ఒకరి తరువాత ఒకరు ఏడాది లోపే కన్నుమూశారు.