Kuwait Bank Loans : ఇకపై ప్రవాసులకు లోన్స్...అంతేకాదు మరొక కీలక విషయం ఏంటంటే..!!!

కరోనా మహమ్మారి వచ్చిన తరువాత దాదాపు అన్ని దేశాల ఆర్ధిక పరిస్థితి దారుణాతి దారుణంగా మారింది.అన్ని వర్గాల ప్రజలు ఆర్ధిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.

 No More Loans For Expatriates And Another Important Thing Is , Bank Of Kuwait, E-TeluguStop.com

ఎంతో మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు.ఈ క్రమంలో అప్పులు ఇచ్చే బ్యాంక్ లు సైతం పాత బకాయిలు వసూలు కాకపోవడంతో కొత్త లోన్స్ ఇవ్వడం కూడా మానేశాయి.

దాంతో అటు బ్యాంక్ లు అప్పులు ఇవ్వక వ్యాపారాలు, ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారు.విదేశాలలో ఉంటున్న ప్రవాసుల పరిస్థితి కూడా ఇదే రకంగా మారింది.

అయితే ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం కుదుటపడుతున్న నేపధ్యంలో బ్యాంక్ లు సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.ఈ క్రమంలోనే కువైట్ ప్రభుత్వం అక్కడి ప్రవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది.

ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడుతున్న క్రమంలో ప్రవాసులకు లోన్స్ ఇవ్వడానికి సిద్దమంటున్నాయి కువైట్ బ్యాంక్ లు.అలాగే కేవలం ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రవాసులకు మాత్రమే కాకుండా ప్రవైటు సెక్టార్ లో పనిచేసే ప్రవాసులకు కూడా లోన్స్ ఇవ్వనున్నాయట.ఇందుకోసం గతంలో ఉన్న షరతులలో, పరిమితులలో మార్పులు చేర్పులు చేసింది.దాంతో ప్రవాసులు లోన్స్ పొందేందుకు గతంలో ఉన్న నిభంధనల కంటే ప్రస్తుతం ఉన్న నిభందనలు ఎంతో ఊరటనివ్వనున్నాయట.

అవేంటంటే.

Telugu Bank Kuwait, Corona, Expat Loans, Expatriates, Kuwait, Private-Telugu NRI

కువైట్ లో గతంలో ఉద్యోగులు లోన్స్ పొందాలంటే తప్పకుండా నెల జీతం రూ.1.32 లక్షలు ఉండాల్సి వచ్చేది అయితే బ్యాంక్ లు శాలరీ పరిమితిని తగ్గించడంతో ప్రస్తుతం రూ.79 వేలు జీతం ఉంటే సరిపోతుంది.అంతేకాదు పని వ్యవధిని సైతం తగ్గించాయట.

గతంలో పని వ్యవధి ఏడాది ఉండేది కానీ ప్రస్తుతం ఇది నాలుగు నెలలకు తగ్గించబడింది.అయితే తాజాగా కువైట్ లోని బ్యాంక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా తరువాత తమ పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయని, ఇలాంటి సమయంలో బ్యాంక్ లు మరలా తమకు లోన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు ప్రవాసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube