Instagram Schedule Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో షెడ్యూల్ ఫీచర్ అందుబాటులోకి.. త్వరలో మరో ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ అనేది అన్ని వయసుల వారు ఇటీవల కాలంలో విస్తృతంగా ఉపయోగించే యాప్‌గా మారింది.యాప్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను కనెక్ట్ చేస్తుంది.

 Schedule Posts Feature In Instagram Details,instagram, Schedule Posts,instagram-TeluguStop.com

మెటా యాజమాన్యంలోని ఈ యాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ యూజర్లకు ఉపయోగపడనుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లను షెడ్యూల్ చేయడానికి వినియోగదారులకు ఈ ఫీచర్ సహాయపడుతుంది.75 రోజులు ముందుగానే మీరు పంపించాలనుకున్న మెసేజ్‌లను, ఇమేజ్‌లను, వీడియోలను షెడ్యూల్ చేసే సౌలభ్యం ఉంది.ఇక ఈ యాప్ లైవ్ వీడియోలను 90 రోజుల ముందుగానే షెడ్యూల్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.

ఈ కొత్త అప్‌డేట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని పోస్ట్‌లను షెడ్యూల్ చేయడంలో సహాయపడుతుంది.ఇది దాని ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ప్రస్తుతం ఇది అందుబాటులోకి రానుంది.అతి త్వరంలోనే యాప్‌లో షెడ్యూలింగ్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

షెడ్యూలింగ్ ఫీచర్ వినియోగించుకునేందుకు ఈ స్టెప్స్ పాటించండి.

ఇందు కోసం ముందుగా మీ మొబైల్‌లోని ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ ఓపెన్ చేయండి.తర్వాత మీరు ఇతరులకు పంపించాలనుకున్న ఇమేజ్ లేదా వీడియోను సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ కనిపించే పస్ల్ చిహ్నంపై క్లిక్ చేయండి.

పైన రీల్‌లను చేయడం కోసం యూజర్లు ప్రొఫైల్ చిత్రంపై నొక్కాలి.మీరు నెక్స్ట్ చిహ్నంపై నొక్కి, మీరు యాడ్ చేయాలనుకున్న ఫిల్టర్‌ను ఎంచుకోవచ్చు.

పోస్ట్‌కు సంబంధించిన క్యాప్షన్ అందించాలి.

Telugu Live, Live Schedule, Schedule, Ups-Latest News - Telugu

ఇక్కడ మీరు అదనంగా యూజర ఎంచుకున్న స్థానం, సంగీతం వంటి అదనపు సమాచారాన్ని అందించవచ్చు.పోస్ట్‌ను షేర్ చేయడానికి ముందు, మీరు పేజీ దిగువన ఉన్న అడ్వాన్స్‌డ్ సెట్టింగ్‌లను ఎంపిక ఉపయోగించవచ్చు.తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి, షెడ్యూల్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు ఫాలోవర్ల ఫీడ్‌లో లైవ్ ఇవ్వడానికి పోస్ట్ చేయాలనుకుంటున్న సమయం మరియు తేదీని ఎంచుకోండి.ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఫ్లోకి తిరిగి వెళ్లండి.

చివరగా, పోస్ట్ ఫీచర్‌ని షెడ్యూల్ చేయడాన్ని పూర్తి చేయడానికి షెడ్యూల్ పోస్ట్ బటన్‌ను నొక్కండి.ఇలా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube