Mastodon app : ట్విట్టర్‌కు పోటీగా మాస్టోడాన్ యాప్.. తరలిపోతున్న లక్షలాది యూజర్లు..

మాస్టోడాన్ అనే ఒక జర్మన్ డెవలపర్ సృష్టించిన ఓపెన్ సోర్స్ సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫారమ్‌ పేరు ప్రస్తుతం ప్రపంచం అంతటా మార్మోగిపోతోంది.ట్విట్టర్‌కు ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా మారింది.

 Mastodon App To Compete With Twitter Millions Of Users Are Moving Twitter, Mast-TeluguStop.com

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత కొత్త రూల్స్ పెట్టాడు.బ్లూ టిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాలని పేర్కొన్నాడు.

ఇలాంటి అనేక నిర్ణయాలను యూజర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ క్రమంలో ట్విట్టర్ తరహాలో ఉండే మాస్టోడాన్ యాప్‌కు భారీగా యూజర్లు పెరుగుతున్నారు.

ట్విట్టర్ నుంచి లక్షలాది యూజర్లు మాస్టోడాన్ యాప్‌కు మారిపోతున్నారు.మాస్టోడాన్ అనేది వికేంద్రీకృత ప్లాట్‌ఫారమ్.

అంటే క్రిప్టోకరెన్సీల మాదిరిగా ఏ ఒక్క వ్యక్తి లేదా సంస్థ దానిని కలిగి ఉండదు లేదా నియంత్రించదు.మాస్టోడాన్ వాక్ స్వేచ్ఛను కూడా సమర్థిస్తుంది.

ప్లాట్‌ఫారమ్ నిర్వహణను దాని వినియోగదారుల చేతుల్లో ఉంచడం ద్వారా ఒక అడుగు ముందుకు వేస్తుంది.

మాస్టోడాన్ యాప్‌ మనం వినియోగిస్తున్నప్పుడు దానిలో ఎలాంటి ప్రకటనలు ఉండవని గమనిస్తాం.

అంతేకాకుండా ఈ యాప్ ఎటువంటి రుసుమును యూజర్ల నుంచి వసూలు చేయదు.ఇందులో ఎడిట్ బటన్, సర్వర్-కస్టమ్ ఎమోటికాన్‌లు, ఆటో డిలీట్ పోస్ట్స్ ఆప్షన్, ఎక్స్‌టెండెండ్ నోటిఫికేషన్ బార్, మెసేజ్‌కు 500 అక్షరాల పరిమితి, అడ్వాన్స్‌డ్ పోస్ట్ ఫిల్టర్ సిస్టమ్, కంటెంట్ వార్నింగ్స్ వంటి ప్రయోజనాలున్నాయి.

ఈ యాప్‌ను ఉపయోగించాలంటే మీరు దీనిని ముందుగా ఇన్‌స్టాల్ చేయాలి.ఆ తర్వాత, మీరు “Get Started“పై నొక్కాలి.

అప్పుడు మీరు సర్వర్‌ని ఎంచుకోవాలి.

Telugu Advancedfilter, Mastodon App, Alternative-Latest News - Telugu

ప్లాట్‌ఫారమ్ నియమాలను అంగీకరించాలి.ఆపై మీ ఐడీ, పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి.మీరు మీ ఇమెయిల్ ఐడీని నమోదు చేయాలని యాప్ అడుగుతుంది.

తర్వాత మీరు మీ ఖాతాను ధృవీకరించడానికి మీ ఈ-మెయిల్ సేవను తెరవాలి.మీరు ఇప్పుడు మాస్టోడాన్ యాప్‌ను వినియోగించుకోవచ్చు.

మాస్టోడాన్‌లో చేరడానికి ప్లాట్‌ఫారమ్‌కు మీకు కనీసం 18 సంవత్సరాలు అవసరం.కానీ మీ 18 ఏళ్ల వయస్సు ఉందో లేదో తనిఖీ చేయడానికి ప్రత్యేకించి ఎలాంటి తనిఖీలు ఉండవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube