Varun Dhawan : ఆ హీరోకు అరుదైన వ్యాధి.. అది తెలిసి అభిమానులంతా లబోదిబో!

ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదిక తెలిపిన విషయం తెలిసిందే.

 Varun Dhawan Suffered Vestibular Hypofunction Disease , Varun Dhawan, Vestibular-TeluguStop.com

తాజాగా మరొక బాలీవుడ్ సెలబ్రిటీ కూడా ఈ విధంగానే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు.అతను మరెవరో కాదు బాలీవుడ్ లో మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ధావన్.

కామెడీతో ప్రేక్షకులను మెప్పించడంతోపాటు తన డాన్స్ ను కూడా ఇరగదీస్తూ ఎంతమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్న వరుణ్ ధావన్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ ఒకరకమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు.

వరుణ్ ధావన్ ఇటీవలే బేడియా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ గత కొంతకాలంగా తాను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే అరుధైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు.ఆ కారణం వల్లే ప్రస్తుతం తన షూటింగులకు కూడా దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలిపాడు వరుణ్ ధావన్.

వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ వ్యాధి యొక్క లక్షణాల విషయానికి వస్తే.

Telugu Bollywood, Suffer, Varun Dhawan, Vestibular-Movie

ఇది చాలా అరుదైన వ్యాధి.వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ లక్షణాలు ఉన్నవారు శరీరంలోని బ్యాలెన్సింగ్ ని కోల్పోవడంతో పాటు వికారం, వాంతులు వచ్చినట్లు అనిపించడం.సరిగా ఒక్కచోటు కూర్చోలేకపోవడం.

కొన్నిసార్లు శరీరంపై పూర్తిగా నియంత్రణ లేకుండా పోవడం ఈ వ్యాది లక్షణాలుగా చెప్పవచ్చు.అలాగే ఈ వ్యాధి చెవి నుంచి మెదడుకు చేరే సంకేతాలను దెబ్బతినే విధంగా చేస్తుంది.

దీని వల్ల కళ్లు తిరగడం.కళ్లు మసకభారడం లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube