మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ 2020లో తన చాటింగ్ ప్లాట్‌ఫారమ్ మెసెంజర్‌లో వానిష్ మోడ్‌ను ప్రారంభించింది.తర్వాత ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ యూజర్‌లు ప్రైవేట్ చాట్‌లను చదివిన తర్వాత అవి అదృశ్యమయ్యేలా చేస్తుంది.ఇన్‌స్టాగ్రామ్ వానిష్ మోడ్ మీ ప్రైవేట్ మెసేజ్‌లను ఇతరులు మీ పరికరంలో స్నూపింగ్ చేయడం ద్వారా చదవకుండా చూసుకుంటుంది.
ఇక్కడ, ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో, ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.
చాటింగ్ ముగిసినప్పుడు ఆటోమేటిక్‌గా అవి తొలగించబడేలా ఈ వానిష్ మోడ్ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఇది దాదాపు Snapchatలో మనం చూసినట్లు మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా తొలగిపోయే లక్షణం కలిగి ఉంటుంది.వినియోగదారులు దీన్ని మాన్యువల్‌గా ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుందని అంతా గమనించాలి.
ఈ ఫీచర్ గ్రూప్ చాట్‌లలో అందుబాటులో ఉండదు.ఇద్దరు వ్యక్తుల మధ్య చాట్‌లలో మాత్రమే పని చేస్తుంది.
ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఒకరినొకరు అనుసరించే వినియోగదారుల మధ్య మాత్రమే ఈ ఫీచర్ పని చేస్తుంది.అపరిచితుల నుండి అయాచిత సందేశాలను నివారించడానికి కంపెనీ వినియోగదారుల కోసం ఈ భద్రతా జాగ్రత్తలు తీసుకుంది.

వినియోగదారులు వారి చాట్ అనుభవంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు.మీరు చాట్ చేస్తున్న వ్యక్తి వ్యానిష్ మోడ్‌లో మీ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్ తీసుకుంటే, యూజర్‌లకు వెంటనే తెలియజేయబడుతుంది.ఇక వానిష్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకుందాం.ఇందుకోసం మీరు తొలుత Instagram యాప్ లేదా వెబ్ పేజీని ఓపెన్ చేయండి.డైరెక్ట్ మెసేజెస్ పేజ్ ఓపెన్ చేయండి.మీరు వానిష్ మోడ్‌లో ఉంచాలనుకుంటున్న చాట్‌ని తెరవడానికి దానిపై క్లిక్ చేయండి.
వానిష్ మోడ్‌ని యాక్టివేట్ చేయడానికి చాట్ స్క్రీన్ దిగువ నుండి పైకి స్వైప్ చేయండి.ఇలా మీరు వానిష్ మోడ్‌ని యాక్టివేట్ చేయండి.
వానిష్ మోడ్‌ను ఆఫ్ చేయడానికి, మీ చాట్ స్క్రీన్ ఎగువన ఉన్న టర్న్ ఆఫ్ వానిష్ మోడ్‌పై నొక్కండి.ఇలా వానిష్ మోడ్ ఎనేబుల్, డిజేబుల్ చేయొచ్చు.







