Adi reddy geethu : ఆదిరెడ్డి గీతూ మధ్య గొడవలు.. ఇది చూడటానికి బాగుందే?

బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకీ రతవత్తరంగా మారుతోంది.కంటెస్టెంట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్న విధంగా నడుస్తోంది.

 Bigg Boss Telugu 6 Adi Reddy Fires On Geethu Bigg Boss 6, Aadi Reddy, Fires , Vi-TeluguStop.com

అంతేకాకుండా కంటెస్టెంట్ లు కూడా టాస్కుల విషయంలో గేముల విషయంలో ఎవరు ఏ మాత్రం తగ్గడం లేదు.అయితే బిగ్ బాస్ సీజన్ 6 మొదలైనప్పటి నుంచి షోలో కంటెస్టెంట్ గీతూని ప్రతి ఒక్క ఎపిసోడ్ లో హైలెట్ చేస్తూ వస్తున్నాడు బిగ్ బాస్.

కాగా ఇప్పటివరకు వదిలిప్రోమో లో ప్రతి ప్రోమో లో కూడా గీతూనే కనిపిస్తోంది.కాగా గీతూ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో గేమ్లలో ఏమైనా లొసుగులు ఉన్నాయా అని మొదటగా చూస్తూ ఉంటుంది.

అయితే ఫిజికల్ టాస్క్ విషయంలో ఆమడ దూరంలో ఉండే గీతు బుద్ధిబలంతో గేమ్ ఎక్కువగా ఆడాలి అని ప్లాన్ వేసుకోవడంతో పాటు పక్కవారిని కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఆడుతూ ఉంటుంది.ఇకపోతే గత వారం గీతూ ప్రవర్తనకి విసిగిపోయిన బిగ్ బాస్ నాగార్జున తో ఫుల్ గా చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే.

ఎపిసోడ్ లో సగం ఎపిసోడ్ మొత్తం గీతూ కి చివాట్లు పెట్టాడు.అయితే హోస్ట్ నాగార్జున అన్ని చివాట్లు పెట్టి అంత గడ్డి పెట్టినా కూడా ఏం మార్పు రాలేదు.

నిన్నటి వరకు బాలాదిత్య వీక్నెస్ పై దెబ్బ కొట్టడం మాత్రమే కాకుండా అతన్ని ఏడిపించేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

కాగా ఈ ప్రోమోని బట్టి చూస్తే ఆదిరెడ్డి తో కూడా గీతూ గొడవ పెట్టుకునేటట్లే కనిపిస్తోంది.కాగా బాత్రూం ఏరియాలో ఆదిరెడ్డి వెళ్లి టీషర్టు దాచుకోవడంతో దొంగగా అక్కడికి దొంగలించి దాచి పెట్టింది.అయితే గీతు గేమ్ లో ఉందా అంటే అది కూడా లేదు.ఆల్రెడీ బ్లూ టీం గీతూని అవుట్ చేసింది.అయినా సరే గీతూ ఆది టీషర్ట్ దొంగలించి దాచేసింది.అప్పుడు గీతూ మీద అనుమానం వచ్చిన ఆది,గీతూ టీ షర్ట్ ఏది అని అడగగా తాను తీయలేదు అని అబద్ధం చెప్పింది.

ఆది మాత్రం గీతూ మీదే డౌట్ పడి ఫైమా దగ్గరికి వెళ్లి కూర్చుని ఒకవేళ గీతూనే ఆ టీషర్ట్ తీసింది అని తేలితే ఇకపై గీతు వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుంది అని హెచ్చరించాడు ఆది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube