గత కొన్నేళ్లలో స్టార్ హీరో బాలకృష్ణను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరిగింది.సాధారణంగా చాలామంది హీరోలు ఫ్లాప్ సినిమాలను సైతం హిట్ సినిమాలుగా ప్రచారం చేసుకుంటారు.
అయితే స్టార్ హీరో బాలకృష్ణ మాత్రం ఫ్లాప్ సినిమాలను ఫ్లాప్ సినిమాలు అనే చెప్పుకోవడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిందనే విషయం తెలిసిందే.
అల్లు శిరీష్ బాలకృష్ణను సింహం అనే పేరుతో సినిమా టైటిల్స్ ఈ ఆప్షన్ లో ఉన్నది కాకుండా మరొకటి చెప్పాలని అడగగా బొబ్బిలి సింహం అని బాలయ్య చెప్పాడు.అయితే అల్లు శిరీష్ మాత్రం ఆ సినిమా కాదని మరొక సినిమా అని చెబుతూ సింహం నవ్వింది అని చెప్పాడు.
బాలయ్య వెంటనే సింహం నవ్వింది ఫ్లాపైందిగా సింహం నవ్వడం ఏంటని అందుకే పోయిందని కామెంట్లు చేశారు.
తన సినిమా ఫ్లాపైంది అని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పే హీరో బాలకృష్ణ అని అందుకే బాలయ్యను జై బాలయ్య అని అంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
పబ్లిక్ ఈవెంట్లలో సైతం ఫ్లాప్ సినిమాల గురించి చెప్పే సత్తా ఉన్న హీరో బాలకృష్ణ మాత్రమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అన్ స్టాపబుల్ సీజన్2 కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు శర్వానంద్, అడివి శేష్ ఈ వారం గెస్ట్ లుగా హాజరు కానున్నారు.విక్టరీ వెంకటేష్ త్వరలో ఈ షోకు గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.అన్ స్టాపబుల్ సీజన్1 సీజన్2 ను మించి సక్సెస్ సాధించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.