కరోనా తర్వాత ఎవరైనా వరుస సక్సెస్ లు దక్కించు కున్నారు అంటే అది ఖచ్చితంగా బాలయ్య అనే ముందు చెబుతారు.ఎందుకంటే కరోనా తర్వాత థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకే అంతా భయపడ్డారు.కానీ బాలయ్య మాత్రం ఒక అడుగు ముందుకు వేసి అఖండ సినిమాను తక్కువ టికెట్ రేట్ కే రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అనుకున్నారు.
50 శాతం ఆక్యుపెన్సీ అయినా తక్కువ ధర టికెట్ విక్రయించినా కూడా భారీ లాభాలను అందుకుంది బాలయ్య స్టామినా నిరూపించింది.ఈ సినిమా హిట్ అయినా తర్వాతనే వరుస సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్రేక్షకులు ముందుకు వచ్చారు.ఇక బాలయ్య ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ మీద కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అదరగొట్టాడు.
బాలయ్య ఒక టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి రికార్డ్ క్రియేట్ చేసాడు.అప్పటి వరకు బాలయ్య అంటే ఉన్న థింకింగ్ మారిపోయి జనాల్లో ఈయనపై మంచి అభిప్రాయం ఏర్పరుచుకున్నారు.
ఇలా ఈ టాక్ షో అత్యంత ప్రజాఆదరణ పొందిన షోగా నెంబర్ 1 స్థానం అందుకుంది.ఇక ఈ షో సీజన్ 1 భారీ హిట్ అవ్వడంతో ఇప్పుడు సీజన్ 2 కూడా అట్టహాసంగా స్టార్ట్ చేసారు.ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ కూడా స్ట్రీమింగ్ అయ్యాయి.

ఇక ఇవే కాదు బాలయ్య మొదటిసారి బ్రాండ్ కమర్షియల్ యాడ్స్ చేసేందుకు ఒప్పుకుని సంచలనం క్రియేట్ చేసాడు.ఇప్పటి వరకు ఎవరు ఎన్ని ఆఫర్స్ ఇచ్చిన పట్టించుకోని బాలయ్య మొదటిసారి ఒక కమర్షియల్ యాడ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సాయి ప్రియా గ్రూప్ బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు.
ఇక ఈ యాడ్ లో కూడా బాలయ్య అందరిని ఆకట్టు కున్నారు.తొలిసారి యాడ్ లో నటిస్తున్న స్టార్ డైరెక్టర్ కావాలంటూ కోరకుండా కొత్త డైరెక్టర్ తో యాడ్ చేసిన అది కూడా బిగ్ హిట్ అయ్యింది.
ఇలా బాలయ్య ఎక్కడ చేయి వేస్తె అది బంగారం అవుతుంది.దీంతో ప్రెజెంట్ బాలయ్య టైం నడుస్తుంది అంటున్నారు.