జాతి రత్నాలు ముద్దుగుమ్మ చాలా క్లారిటీతో ఉంది భయ్యా..!

జాతి రత్నాలు సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన హైదరాబాది అమ్మాయి ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం తెలుగు లో వరుస సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.ఈమె హైట్ కాస్త ఎక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్ హీరోయిన్ పాత్ర లకు ఈమె సెట్ అవ్వదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 Jathiratnalu Heroine Faria Abdullah Interesting Comments Faria Abdullah, Tollyw-TeluguStop.com

ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఈ అమ్మడు లైక్‌ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా లో నటించింది.ఆ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యం లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ తాను సినిమా లు చేయడం కోసం ఆసక్తి గా ఉన్నాను, కానీ అవకాశాల కోసం ఏది పడితే అది చేయను అంటూ చెప్పుకొచ్చింది.అవకాశాలు లేకుంటే ఖాళీ గా ఉంటాను తప్పితే వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ కి ఓకే చెప్పి కెరియర్ విషయం లో తప్పుడు నిర్ణయాలు తీసుకోను అంటూ ఆమె చాలా క్లారిటీగా పేర్కొంది.

అంతే కాకుండా ఒక వేళ సినిమాల్లో చాన్స్ రాక పోతే దర్శకత్వం చేస్తానంటూ పేర్కొంది.ఇప్పటి నుండే కొన్ని కథ లను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఆమె తెలియజేసింది.

తెలుగు సినిమా పరిశ్రమ లో ఉన్న మంచి నటీనటులతో కలిసి వర్క్ చేసే ఆలోచనతో తాను ఉన్నట్లుగా ఫరియా పేర్కొంది.ప్రస్తుతం రవితేజ తో ఒక సినిమా లో నటిస్తున్నట్లుగానే తెలియ జేసింది.

Telugu Faria Abdullah, Jathiratnalu, Share Subcribe, Ravi Teja-Movie

అంతే కాకుండా హిందీ మరియు తమిళం నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయని.వాటికి తాను సరైన సమయం లో సమాధానం ఇస్తాను అంటూ పేర్కొంది.ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఒక స్టార్ హీరో సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై ఫరియా ప్రస్తుతానికి ఏం చెప్పలేను అన్నట్లుగా సమాధానం ఇచ్చింది.

తాజా చిత్రం తో తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటున్నానే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube