కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్,టాలీవుడ్ యంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కర్ణాటక ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది.ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం నవంబర్ ఒకటవ తేదీ జరగబోయే ప్రత్యేకమైన కార్యక్రమానికి కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్ అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు.
ఇలా ఈ ఇద్దరు హీరోలకి కర్ణాటకతో అనుబంధం ఉండటంవల్ల వీరికి ఆహ్వానం అందిందని తెలుస్తోంది.గతంలో రజనీకాంత్ బస్సు కండక్టర్గా కర్ణాటక ప్రభుత్వంలో పని చేశారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లిది కర్ణాటక కావడంతో వీరిద్దరికీ కర్ణాటకతో సంబంధం ఉండటం వల్ల కర్ణాటక ప్రభుత్వం నవంబరు ఒకటవ తేదీ నిర్వహించబోయే కార్యక్రమానికి వీరిని ఆహ్వానించారు.కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారంగా భావించే కర్ణాటక రత్న అవార్డును నవంబర్ ఒకటవ తేదీ శాసనసభ ముందు ఒక కార్యక్రమాన్ని నిర్వహించి నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ప్రకటించనున్నారనే విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ కర్ణాటక రత్న అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు సమాచారం.

ఇప్పటివరకు ఎనిమిది మందికి మాత్రమే ఈ అత్యున్నతమైన పురస్కారం అందింది.అయితే తొమ్మిదవ వ్యక్తిగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి ఈ అవార్డును అందించనున్నారు.ఈ క్రమంలోనే పునీత్ కుటుంబ సభ్యులు కర్ణాటక రత్న అవార్డును అందుకోబోతున్నారు.
పునీత్ రాజ్ కుమార్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా మానవతావాదిగా ఎన్నో సహాయ సహకారాలను చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆయన మరణాంతరం తనకు కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పునీత్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనబోతున్నారు.







