లోన్ యాప్ కేసులు పై ఫిర్యాదులు రోజురోజుకు వెల్లువెత్తుతున్న వస్తున్నాయి.ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసు వారు దర్యాప్తు వేగవంతం చేసి కేసును ఛేదించారు.
ఈ సందర్భంగా లోన్ ఆప్ లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటి వేధింపులకు ఎవరు గురికాకూడదు అని, ఇలాంటి ఫోన్ కాల్ గాని వస్తే ఎవరు నమ్మవద్దని డీసీపీ విశాల్ సూచించారు.ప్రస్తుతం విజయవాడ పోలీసులు ఛేదించిన ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నామని తెలిపారు.
ఎవరికైనా అత్యవసరం వస్తే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలి తప్ప ఇలాంటి లోన్ యాప్ లను నమ్మవద్దని పోలీసు వారు సూచించారు.