హీరోయిన్ ఆమనీ… ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం అభినయం, అందం తో సౌత్ ఇండియా అగ్ర శ్రేణి హీరోయిన్ గా 80 మరియు 90 వ దశకం లో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగింది.పుట్టి, పెరిగింది బెంగుళూరు లో అయినా కూడా తెలుగు సినిమాల ద్వారానే ఆమె పాపులర్ హీరోయిన్ అయ్యింది.
తొలుత నరేష్ సరసన జంబ లకిది పంబ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఆమని ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తో మిస్టర్ పెళ్ళాం సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించడం తో ఆమె సౌత్ లో తిరుగు లేని హీరోయిన్ అయ్యింది.
ఇక తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో దశాబ్ద కాలం పాటు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును తనకు తెలియకుండానే మోసపోయింది ఆమని.ఆమె పోగొట్టుకున్న డబ్బు నేటి రోజుల్లో కోట్లల్లో ఉంటుందట.
ఈ విషయం ఆమని ఒక ఇంటర్వ్యూ లో తెలియచేయడం విశేషం.ఇక ఆమె సంపాదించిన డబ్బు బయట వాళ్ళు ఎవరు పోగొట్టుకోలేదు అట.తన సొంత మేనేజర్ల చేతిలోనే తన డబ్బంతా కూడా పెట్టేది.ఆ సమయంలో ఆమె సినిమాలతో బిజీ గా ఉండటం వలన ఆ డబ్బంతా ఏమైపోతుందో సరిగ్గా చూడలేకపోయింది.
ఇక ఆమె తండ్రి కూడా ఆమని చిన్న వయసులోనే చనిపోవడం, ఆమె తమ్ముడు చాలా చిన్నవాడు కావడం తో చాల డబ్బును ప్లానింగ్ లేకుండా పోగొట్టుకోవాల్సి వచ్చిందట.
ప్రస్తుతం పోయిన డబ్బు గురించి పట్టించుకోకుండా ఉన్న దాన్ని అయినా కాపాడుకుంటున్నానని తెలిపింది ఆమని. ఇక ఆమె హీరోయిన్ గా ఫెడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వరస పెట్టి సినిమాలు చేస్తుంది.వెండి తెర పైన మాత్రమే కాకుండా బుల్లి తెర పైన సీరియల్స్ లో నటిస్తూ, రియాలిటీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం.
ఇక ఆ మధ్య కాలంలో లేటు వయసులో సీనియర్ హీరో నరేష్ తో లిప్ లాక్ చేయడం కాంట్రవర్సీ అయ్యింది.ఆమనీ వ్యక్తి గత జీవితానికి వస్తే ఆమనీ 2012 లో ఖాజామిడీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉంది.