సోషల్ మీడియా పుణ్యమా అని బయట ఎక్కడెక్కడో జరిగే పలు దృశ్యాలను మనం చూస్తున్నాం.లేకపోతే మన పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు.
కానీ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మన పక్కింట్లో జరిగేది, పక్క ఊర్లో జరిగేది, పక్క జిల్లాలో, పక్క రాష్ట్రం లో, పక్క దేశం లో జరిగేది కూడా మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం.
ఎందుకంటే ప్రపంచం లో జరిగే ప్రతి వింతైన దృశ్యాలు సోషల్ మీడియా కు వచ్చి చేరుకుంటున్నాయి.
అదే విధంగా ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే గుజరాత్‌లోని మోర్బి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనారాయణ సొసైటీలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఓ మహిళ తన కుమారుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఏదో పనిమీద వెళుతుంది.
అక్కడే వీరికి కొంచెం దూరంలో ఉండే ఒక ఆవు, ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ తల్లి కొడుకుని చూసిన మరుక్షణమే ఆవు తల్లీకొడుకు పైకి దూసుకొచ్చింది.ఆ పిల్లాడిపై దాడి చేసేందుకు ఆవు యత్నించింది.
దీంతో అప్రమత్తమైన తల్లి తన ప్రాణాలను ఫణంగా పెట్టి, కుమారుడిని ప్రాణాలను కాపాడుకుంది.ఆ తర్వాత ఆవు కాసేపు తల్లీకొడుకు పై దాడి చేసినప్పటికీ ఆ తల్లి కొడుకు కోసం వీరోచిత పోరాటం చేసింది.అక్కడే ఉన్న స్థానికులు ఆమె అరుపులు విని అక్కడికి చేరుకోని ఆవును బెదర గొట్టి వెళ్లగొట్టారు.తల్లీకొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
తల్లికి మించి యోధురాలు ఎవరుంటారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.