టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో జరుగుతున్న విషయం ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి తెలిసిందే.టి20 క్రికెట్ అంటే ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది.తాజాగా ఈ పొట్టి వరల్డ్ కప్ క్రికెట్లో మరో రికార్డ్ నమోదయింది.టి20 వరల్డ్ కప్ 2022 సూపర్ 12 మ్యాచ్ లు ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఈ రికార్డు నమోదయింది.ఈ మ్యాచ్లో మొదటిగా బ్యాటింగ్ చేసిన ఆపనిస్తాన్, ఇంగ్లాండ్ ఫెసర్ల దెబ్బకు 112 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
ఇంగ్లాండ్ ఫేసర్లలో సామ్ కర్రన్ (5/10) ధాటికి 19.4 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే చేసింది.కర్రన్‌కు తోడుగా బెన్ స్టోక్స్ (2/19), మార్క్ వుడ్ (2/23), క్రిస్ వోక్స్ (1/24) పర్వాలేదనిపించారు.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) వీరిద్దరూ మాత్రమే కాసేపు ఇంగ్లాండు బౌలర్లను ఓపికతో ఎదుర్కొన్నారు.ఈ మ్యాచ్లో ప్రపంచ రికార్డు ఎలా నమోదు అయిందంటే, ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్‌ల రూపంలో అవుట్ అవ్వడం వల్ల ఈ రికార్డు నమోదయింది.

పొట్టి క్రికెట్ చరిత్రలో ఇలా పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే జరిగింది.ఇదే ఏడాది క్రెఫెల్డ్ వేదికగా ఆస్ట్రియా-జర్మనీ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలిసారి పది మంది ప్లేయర్లు క్యాచ్‌ల రూపంలోనే అవుట్ అయ్యారు.ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లో ఈ సీన్ రెండోసారి రిపీట్ అవ్వడం వల్ల ఈ రికార్డ్ నమోదయింది.
అయితే ఇంగ్లాండ్ జట్టు 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.ఈ కాస్త లక్ష్యాన్ని చేదించడానికి ఇంగ్లాండ్ 18.1 ఓవర్లలో చేదించింది.ఐదు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.