జాతీయ పంచాయతీ అవార్డులకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో జాతీయ పంచాయతీ అవార్డులకు ప్రతిపాదనల సమర్పణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవార్డుల ఎంపికకు ప్రాధాన్యత రంగాల్లో ప్రగతిని సూచించాలన్నారు.130 ప్రశ్నలు ఉన్నట్లు, ఆ ప్రశ్నలకు సంబంధించి ఆయా శాఖల నుండి సమాధానాలు సవివరంగా సమర్పించాలన్నారు.సంక్షేమం, డిఆర్డీవో, మిషన్ భగీరథ, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్, హౌజింగ్, వ్యవసాయం, జిపిడిపి, పౌరసరఫరాలు తదితర శాఖలు పారమీటర్స్ ప్రకారం చేపట్టిన ప్రగతిని విపులంగా తెలుపాలన్నారు.సంబంధిత పారామీటర్స్ లో చేపట్టిన వినూత్న చర్యలు గురించి తెలుపాలన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకై డ్రై డే కార్యకలాపాలు, ప్రత్యేక వైద్య శిబిరాలు, హోటళ్లు, వసతి గృహాల్లో ఆహార తయారీదార్లకు టైఫాయిడ్ టెస్టులు, టీకాలు, జన్ ధన్ ఖాతాలు, పల్లె ప్రకృతి వనాలు, ఓపెన్ స్థలాలు, అండర్ బ్రిడ్జిల గ్రీనరీ, పాఠశాలల అభివృద్ధి తదితర పనుల విషయమై ప్రతిపాదనలలో పొందుపర్చాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, డిఆర్వో శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.