శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం చోరీ నిందితులను పట్టుకున్న ఖమ్మం పోలీసులు..

నగరంలోని బ్యాంక్ కాలనీలో గత నెల 27న అర్ధరాత్రి సమయంలో శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయం తాళాలు పగలగొట్టి స్వామివారి బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీలో గల నగదును అపహరించుకొని పారిపోయిన ముగ్గురు నిందుతులను ఈరోజు ఉదయం 7:00 గంటల సమయంలో ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం టోన్ ఏసీపీ అంజనేయులు వివరాలు వెల్లడించారు.

 Khammam Police Caught Sri Seetaramanjaneya Swamy Temple Robbery Culprits, Khamma-TeluguStop.com

విజబుల్ పోలీసింగ్ భాగంగా ఈరోజు నగరంలోని ఎన్టీఆర్‌ సర్కిల్ వద్ద సిసియస్ ఏసిపి రవికుమార్, టూ టౌన్ సిఐ సిహెచ్ శ్రీధర్, సీసీఎస్ సీఐలు మల్లయస్వామి, నవీన్ , సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారించగా శ్రీసీతారామాంజనేయ స్వామి అలయంలో చోరి చేసినట్లు అంగీకరించారని దోచుకున్న ఆభరణాలు, నగదు సుమారు 100గ్రాములు, వెండి సుమారు 2.5 kg లు, హుండీ లో నగదు రూ.24,090/-, రికవరీతో పాటుమోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ సుమారు 7 లక్షల వరకు వుంటుందని తెలిపారు.

నిందుతుల వివరాలు:-

1)జంగా వెంకన్న 29 సం, రఘునాధపాలెం మండలం, కోయచెలక గ్రామం, వృత్తి : సుతారి పని.

2) వల్లపు సుమంత్ 20 సం, న్యూ గొల్లగూడెం, కొత్తగూడెం, వృత్తి కారు డ్రైవర్.

3) పేరబోయిన రాజేష్ 25 సం, కన్స్ట్రక్షన్ సూపర్వైజర్, BC కాలనీ, బల్లేపల్లి ఖమ్మం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube