వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో చిట్ చాట్అంకితభావం, సానుకూలమైన దృక్పథమే సీఎం జగన్ గారి సక్సెస్ కు కారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఒకే కుటుంబం.పొరపచ్చాలకు తావు లేదు గడప గడపకూ ప్రభుత్వంపై సీఎంగారి సమీక్షనూ ఎల్లో మీడియా వక్రీకరించింది గోతి కాడ నక్కల్లా టీడీపీ – ఎల్లో మీడియా కాచుకు కూర్చున్నాయ్.
గడప గడపకూ కార్యక్రమానికి స్పందన చాలా బాగుంది.సీఎం గారి సమీక్ష తర్వాత ఎమ్మెల్యేలకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యంహరీష్ రావుకు కేసిఆర్ తో వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయేమో.
మమ్మల్ని విమర్శిస్తే.వాళ్ళ మామ కేసిఆర్ ను తిడతామని కాబోలు.! సజ్జల రామకృష్ణారెడ్డి ఉచిత విద్యుత్ మా పేటెంట్మీ టర్లు అంటూ.చంద్రబాబు, ఎల్లో మీడియానే రాద్ధాంతం మెడికల్ కాలేజీలను మేమే కట్టితీరుతాం.2024లోనూ మాదే అధికారంఒక ఇల్లు కట్టడానికి ఏడాది పడితే.మెడికల్ కాలేజీ నిర్మించడానికి 5 ఏళ్ళు పట్టదా?టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ళ పేరుతో దోపిడీ టిడ్కో ఇళ్ళకు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు51 వేల మంది టిడ్కో ఇళ్ళు మాకొద్దు.అని చెప్పారుసోషల్ మీడియా బరితెగింపునకు టీడీపీనే కారణం.మహిళల్ని గౌరవించడం మా పార్టీ కల్చర్.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఏ రోజు కూడా రాజకీయ పార్టీ పెట్టుకోవడం అనేది మా హక్కు అనేలా కాకుండా, రాజకీయాలను సీరియస్ ప్రొఫెషన్‌లా తీసుకున్నాం.ఇతర వృత్తులు లాగానే రాజకీయాలు కూడా ఒక వృత్తిలా, అంకితభావంతో, పాజిటివ్ దృక్పథంతో చేయడం వల్లే, మా పార్టీ, ముఖ్యమంత్రి జగన్ గారి సక్సెస్‌కు ఒక కారణం.
గడప గడపకూ కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రి జగన్ గారు సమీక్షలో చాలా పాజిటివ్‌గా మాట్లాడారే తప్ప, ఎవర్నీ విమర్శించలేదు.ముఖ్యమంత్రిగారు తన నియోజకవర్గంలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో, తన సోదరుడు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని స్వయంగా సీఎంగారే చెప్పారు.
మంత్రులతో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా గడప గడప కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని చెప్పారు.గడప గడపకూ కార్యక్రమం అనేది ముందే నిర్ణయించింది.
దానిపై, కన్సల్టెంట్‌ల నుంచి సైంటిఫిక్‌గా రిపోర్టు తీసుకుని దాని ఆధారంగా సమీక్ష చేసుకున్నాం.టెక్నాలజీ, డిజిటల్, సోషల్ మీడియా వినియోగం పెరగడంతో… ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాం.
ప్రజలతో మరింతగా మమేకం అయ్యేందుకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడైనా పొరపాట్లు, లోటుపాట్లు ఉంటే వాటిని తెలుసుకునేందుకు సమీక్ష చేసుకున్నాం.
ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూస్తే అది అర్థం అవుతుంది.
పనితీరు బాగోలేదని నివేదికలు వచ్చిన వారిలో కూడా గెలవగలిగేవాళ్లు చాలామంది ఉన్నారు.ముఖ్యమంత్రిగారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే.వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుని, కాన్ఫిడెన్స్‌తో పాటు డిసిప్లెయిన్ కూడా అవసరం అన్నదే.75 శాతంతో వచ్చే ఉత్తీర్ణతను.వంద శాతం మెజార్టీ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలే ఇవన్నీ.పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ కలెక్టివ్ రెస్పాన్స్‌బులిటీ అనేది ఉంటుంది.27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వాళ్లనేదో దోషులుగా నిలబెట్టి మాట్లాడింది లేదు.మా ముఖ్యమంత్రిగారు చెప్పిన విషయాలను అందరం సానుకూలంగా తీసుకున్నాం.
కుటుంబం అన్నాక అందులో ఉండే లోటుపాట్లను ఎలా సరిదిద్దుకుంటామో.అదే మాదిరిగా మా పార్టీ సమీక్షలోనూ అదే జరిగింది.
గడప గడపకూ కార్యక్రమంపై టీడీపీ-ఎల్లో మీడియా వక్రీకరణఅన్ని రాజకీయ పార్టీలు ఏకమై, ఏకతాటిగా మాపై దాడి చేస్తున్నాయి.దాంతో మా బలం ఏమిటో తెలియజెప్పేందుకు, మా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు గడప గడప కార్యక్రమం చేపట్టాం.
అది పరిపూర్ణంగా విజయవంతం కావాలంటే చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రిగారు చెప్పిన మాటలను విపక్షాలతో పాటు, ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది.
మా పార్టీలో ఎవరైనా నలుగురు అసంతృప్తితో ఉంటే.
వారిని ఏమైనా తమ పార్టీలోకి లాక్కోవచ్చా అనేలా గోతికాడ నక్కల్లా, ఒక గ్యాంగ్ ఆఫ్ ఫోర్” గా వారంతా కాచుకుని ఉన్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారిని ఏ రకంగానూ ఎదుర్కోలేక దీన్ని అవకాశంగా తీసుకున్నారు.
పార్టీలో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని, పీకే టీమ్ లేకపోతే గెలవలేమా.అంటూ రాతలు రాయడం, కథనాలు ప్రసారం చేయడం చూశాం.
మా పార్టీవాళ్లపై ఎక్కడ లేని సానుభూతి చూపిస్తున్నారు.ఎబీఎన్ రాధాకృష్ణను చూస్తే జాలేస్తోంది.
మా పార్టీలో అందరం చాలా పాజిటివ్‌గా ఉన్నాం.ఎక్కడా అసంతృప్తి లేదు.
మా ముఖ్యమంత్రిగారి సమావేశం తర్వాత మా అందరిలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది.గడప గడపకు మా ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు.
రాజకీయాలు అనేది సీరియస్ జాబ్ అనే మెసేజ్ అందులో ఉంది కదా.అది పనిష్‌మెంట్ కాదు.
మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.చేతనైతే టీడీపీ వాళ్లను, పవన్ కల్యాణ్‌ను తిరగమనండి.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని దాన్ని పరిష్కరించే దిశగా చేసే పాదయాత్ర అనుకుంటే అది ఎవరు చేసినా మంచిదే.ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆ హక్కు ఉంటుంది.
ఈ విధానాన్ని జగన్ మోహన్ రెడ్డిగారు స్వాగతిస్తారు.పోటీ తత్వం ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.
వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నాం వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ చేయబోతున్నారనేది వాళ్ల కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టే వాళ్లు బెంబేలెత్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో అసహ్యమైన రాతలపై మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది.
మా ముఖ్యమంత్రిగారికి మహిళలు అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి.మేము అది అన్నింట్లో చూపిస్తున్నాం.
ప్రతిపక్షంలో అవి కరువయ్యాయి కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి.వారికి వేరే అజెండా లేదు కాబట్టే ఇటువంటి చేష్టలు, రోత కూతలు.
ఒక క్రిమినల్స్ మాదిరిగా, దొరకకుండా ఎలాంటి నేరాలు చేయాలో వాటన్నింటినీ టీడీపీ- ఆ వర్గం మీడియా, సోషల్ మీడియా మా మీద ప్రయోగిస్తుంది.వాటిని మామీద రుద్దాలని ప్రయత్నిస్తోంది.
ఇటువంటి విధానాలను మేము ప్రోత్సహించం.అవతలవాళ్లు గెయిన్ చేసుకోవాలని చూస్తే అది వాళ్ల పూలిష్‌నెస్.
ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యమాకు సంబంధించినంత వరకూ ఆంధ్రప్రదేశ్ అనేదే మా క్షేత్రం.రాష్ట్ర ప్రజలందరి ఇంట్రెస్టే.మా టార్గెట్.దీనిపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.
మాకు స్పష్టత ఉండటం వల్లే ఎవరూ మమ్మల్ని ఏ ఫ్రంట్ అని అడగటం లేదు.జగన్ మోహన్ రెడ్డిగారికి పూర్తి క్లారిటీ ఉంది.
మా ప్రభుత్వానికిగానీ, మా పార్టీకి గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాలే ముఖ్యమనేది మా పాలసీ.మా అధ్యక్షుడి ఆలోచనా ధోరణి కూడా అదేవిధంగా ఉంది.
రాష్ట్రానికి సంబంధించినంతవరకూ, ఏ రాజకీయ పార్టీ అయినా మేమిది చేస్తామని చెప్పి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలే తప్ప, అధికారం కోసం అతుకులు వేసి పొత్తులు పెట్టుకోం.జగన్ మోహన్ రెడ్డిగారిది ఇదే పాలసీ వారసత్వ రాజకీయాలపైన కూడా జగన్ గారు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు.
ఏ పార్టీలో చూసినా వారసత్వ రాజకీయం గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడిన వాళ్లు ఉన్నారా? రాజకీయాలను సీరియస్‌గా తీసుకునేవాళ్లకే అవకాశం ఉంటుంది తప్ప, వారసత్వంగా వస్తామంటే కుదరదని ముఖ్యమంత్రిగారు చాలా స్పష్టంగా చెప్పారు.
ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగితే మీకు ఆనందమా.
జగన్ మోహన్ రెడ్డిగారిని అర్జెంట్‌గా ఎలా అధికారంలో నుంచి దింపేయాలా అనేదే లక్ష్యంగా ఎల్లో మీడియా పనిచేస్తోంది.ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగితే సంతోషించే రీతిలో “గ్యాంగ్ ఆఫ్ ఫోర్” పని చేస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఈనాడు పత్రికల్లో వచ్చిన బ్యానరు వార్తలను చూస్తేనే ఈ విషయం బాగా అర్థం అవుతుంది.పక్క రాష్ట్రాల వాదనలను కూడా బాగా హైలైట్ చేసి ఏపీ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే ఆశతో, పడకపోతే ఆశాభంగంతో వార్తలు రాస్తున్నారు.
ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి లేదు.పోలవరం ప్రాజెక్టు 58 లక్షల క్యూసెక్కులు తట్టుకోలేదని చెబుతున్నారు… దాని కెపాసిటీ 190 టీఎంసీలు.
వరదలు వస్తే డ్యామ్‌లో నీళ్లను నిలువ చేయం కదా? దిగువకు వదిలేస్తాం.శాస్త్రీయ అధ్యయనాలు, కేంద్రం కూడా ఇదే చెబుతుంది.
పొరుగు రాష్ట్రం టెక్నికల్‌గా మనల్ని ఇబ్బంది పెట్టాలనో… వీటిని రైజ్ చేసినంతమాత్రాన ఇందులో ఎలాంటి వాస్తవం లేదు.
హరీష్ రావుకు కేసిఆర్ తో సమస్యలు ఉంటే మా మీద పడితే ఎలా.తెలంగాణ మంత్రి హరీశ్‌రావుకు ఎందుకంత ఆవేశం వస్తుందో తెలియదు.మన రాష్ట్రానికి సంబంధించి అంశాలపై విమర్శలు చేయడం రెండు, మూడు సంఘటనల్లో చూశాం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే “గ్యాంగ్ ఆఫ్ ఫోర్” గా తయారై జగన్ మోహన్ రెడ్డిగారిపై ఒక పథకం ప్రకారం ఎటాక్ చేస్తోంది.వారికి తగ్గట్టే హరీష్ రావు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధమైన వాతావరణం ఉంది.తెలంగాణకు సంబంధించి మేమెప్పుడూ కామెంట్ చేయలేదు.
అధికారంలో ఉన్నవాళ్లు వారి సమస్యలను పరిష్కరించుకోవాలే కానీ, పక్క రాష్ట్రం గురించి వారికెందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, వారికి సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం.సమస్యలు ఉంటే కూర్చుని సామారస్యంగా చర్చించుకుంటున్నాం.
హరీశ్‌రావు చేసిన విమర్శలకు మేము కామెంట్ చేయం, ఆ రొచ్చులోకి దిగాలనుకోవడం లేదు.హరీష్ రావుకు, కేసిఆర్ కు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే.
వాళ్ళువాళ్ళూ చూసుకోవాలి.మమ్మల్ని విమర్శిస్తే.
మేం తిరిగి, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కేసిఆర్ ను తిడతామని ఈ విధంగా హరీష్ రావు మాట్లాడి ఉండవచ్చు.మేము ఆ ఉచ్చులో పడం.తెలంగాణ మీద మేము ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే.ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అవే బ్యానర్లు పెట్టి దూరం పెంచే కార్యక్రమాలు చేస్తారు.
వాటిద్వారా రెండు రాష్ట్రాల మధ్య దూరం పెంచాలనే, వారి ఉద్దేశం కనిపిస్తోంది.రెండు రాష్ట్రాల మధ్య సమస్య అయితే స్పందించాలే తప్ప.
తమ ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా… పక్కింట్లో ఏం జరుగుతోందో తొంగి చూడటం దారుణం.
విద్యుత్ మీటర్లు బ్రహ్మాండమైన సంస్కరణవిద్యుత్ మీటర్లకు సంబంధించి ప్రతిదానికీ మా దగ్గర సమాధానం ఉంది.
చంద్రబాబు నాయుడును మించి ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణలు మా ప్రభుత్వం మీద, పార్టీమీద విమర్శలు చేస్తున్నారు.వాళ్లే ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే బాగుండేది.అప్పుడు మాకు, వాళ్లకు స్ట్రయిట్ ఫైట్ ఉండేది.కానీ చంద్రబాబు అజెండాను కూడా, ముందుగా వీళ్లే డిసైడ్ చేస్తున్నారు.
వాయిస్ రైజ్ చేస్తోంది గ్యాంగ్ ఆఫ్ ఫోర్.మోటార్లకు మీటర్ల విషయంపై.
తెలంగాణ రాష్ట్రం వాళ్లు వాళ్ళ సంగతి చూసుకోవాలి.మేము పెట్టాం కదా మీరెందుకు పెట్టలేదని మేము అడగలేదు కదా?.మోటార్లకు మీటర్లు పెట్టడం అనేది మంచి సంస్కరణ అనేది మేము భావిస్తున్నాం.అయితే గ్యాంగ్ ఆఫ్ ఫోర్… మోటర్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.వాళ్లతో జతకట్టి టీఆర్‌ఎస్ కానీ, తెలంగాణ మంత్రులుగానీ మామీద పడాల్సిన అవసరం లేదు.హరీశ్‌రావుకు కేసిఆర్ తో వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో మాకు అనవసరం.
రైతులకు ఉచిత విద్యుత్‌పై పేటెంట్ మాది.వైయస్సార్ గారి హయాంలో ఉచిత విద్యుత్ అందించడం అసాధ్యం అన్నవాళ్లు, ఇవాళ దానిపై మాట్లాడటానికి హక్కు లేదు.జగన్ మోహన్ రెడ్డిగారు విషయానికి వస్తే.తక్కువ ఖర్చుతో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వంపై ఖర్చు తగ్గించుకోవడం, రైతులకు నిర్దేశిత నాణ్యమైన విద్యుత్ ను ఇవ్వడం అనేది బ్రహ్మాండమైన సంస్కరణ.
రైతుల గురించి ఆలోచించే మీటర్లపై ఈ నిర్ణయం తీసుకున్నాం.శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు అవుతోంది.
అక్కడ నుంచి ఎలాంటి ఫిర్యాదులేదు.ఈ ప్రక్రియ సజావుగా సాగుతోంది.
దీని ద్వారా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెరగడం అనేది కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీనే తప్ప, మరొకటి కాదు.వస్తే అదనంగా రెండు నుంచి మూడు వేలకోట్లు వస్తాయి.
విద్యుత్ మీటర్ల వల్ల, జవాబుదారీతనం పెరుగుతుంది, రైతులే మొత్తం విద్యుత్ దోచేసుకుంటున్నారే అపప్రద తొలుగుతుంది.డిస్కమ్‌లపై భారం తగ్గుతుంది.
రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారనే దానిపై స్పష్టత రావడంతో పాటు ముఖ్యంగా మోటర్లు కాలిపోవడం అనేది జరగదు.ఇన్ని ప్రయోజనాలను పక్కకు తోసి, బుదర చల్లుతున్నారంటే, ఇదంతా పొలిటికల్ ఇంటెన్షన్‌తోనే దుష్ట చతుష్టయం చేస్తుంటే హరీశ్‌రావు మామీద ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదు.
కేసీఆర్‌గారు మాట్లాడితే దానిపై స్పందించాలి తప్ప…దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మెడికల్ కాలేజీలు మేమే పూర్తి చేస్తాంచంద్రబాబు నాయుడు వర్చువల్‌గా అమరావతి కట్టారు కదా.అలాంటివాటిని కేవలం కంప్యూటర్‌లోనే చూపించవచ్చు.రియల్‌గా కట్టేవాటిని ఎలా చూపిస్తాం.
రాత్రికి రాత్రే నిర్మాణాలు పూర్తికావు కదా.చంద్రబాబు పేపర్ మీద తప్ప ఏం పనీచేయలేదు.కానీ జగన్ మోహన్ రెడ్డిగారు అలా కాదు.మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ప్రాసెస్ నడుస్తోంది.ఏమీ లేకుండా పేపర్ మీద ఉండటమో, శిలా ఫలకం వేసి వదిలేయడమో మేము చేయం.2024లోనూ మేమే గెలుస్తాం.మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు.పని ప్రారంభించారు.ఇల్లు కట్టడానికే ఏడాది పడితే.మెడికల్ కాలేజీ పూర్తవ్వడానికి నాలుగు, ఐదేళ్లు పడుతుంది.మేము పని పక్కన పెడితే కదా ప్రశ్నించాల్సింది.
51 వేల మంది టిడ్కో ఇళ్ళు వద్దన్నారుటీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ళు ఎందుకు కట్టలేదు.అన్న ప్రశ్నకు టీడీపీ నుంచి గానీ, వారి అనుబంధ మీడియా నుంచి గానీ సమాధానం లేదు.టిడ్కో ఇళ్ళ దగ్గర మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు.
బహుళ అంతస్తులు కట్టి, మౌలిక సదుపాయాలు లేకపోతే, ఎవరైనా ఎలా నివసిస్తారు.టిడ్కో ఇళ్ళ పేరుతో టీడీపీ అవినీతికి పాల్పడింది.
నిజానికి టిడ్కో ఇళ్ళు మాకు వద్దని తిరస్కరించిన వారి జాబితా ఏకంగా 51 వేల మంది ఉన్నారు.వారు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి?.జాబితా ఎందుకు మారుతోంది? బాబు కట్టింది లేదు కాబట్టి, రెండోది మనందరి ప్రభుత్వం ఇళ్ళ స్థలంతోపాటు ఇండిపెండెంట్ ఇళ్ళు కట్టించి ఇస్తోంది కాబట్టి.ప్రజలు ఇండిపెండెంట్ హౌస్ కావాలని భావిస్తుంటే.
ఈనాడుకు, చంద్రబాబు ఇళ్ళు గురించి ఎందుకంత మమకారం?.బాబు కట్టని ఇళ్ళు గురించి వారంతగా ఓన్ చేసుకోవడం కంటే.
ప్రజల ఆకాంక్షలు తెలుసుకుని, వాటిని జగన్ గారు అమలు చేస్తున్నారని గ్రహిస్తే మంచిది.వాళ్లకు ప్రశ్నించే హక్కులేదు.
చంద్రబాబు సర్కార్ ప్రజలను మోసం చేశారని చెప్పుకోవడానికి మాకు అవకాశం దొరికింది.