టెక్నాలజీ పెరగడంతో మనిషికి అవసరమైన వస్తువులు మార్కెట్లోకి ఇబ్బుడిముబ్బడిగా వస్తున్నాయి.మనిషి తన సమయాన్ని అదుపుచేసే క్రమంలో అనేక రకాల వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నాడు.
అటువంటివాటిలో వాషింగ్ మెషిన్ ఒకటి.ఇది మహిళలు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సమయాన్ని, శ్రమను తగ్గించి క్షణాల్లో బట్టలని వాష్ చేసేస్తుంది.అయితే అందరూ దీనిని కొనుక్కొనే పరిస్థితి లేదు.
అందువలన మార్కెట్లోకి అన్ని తరగతులవారికి అందుబాటులోకి వచ్చేటువంటి వాషింగ్ మెషిన్ ని తాజాగా విడుదల చేసారు.ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్.
చాలా చిన్నదిగా ఉంటుంది.పైగా ధర కూడా అంతే తక్కువ.
ఇది టెక్నో ఆటోమేటిక్ పోర్టబుల్ ఫోల్డబుల్ వాషింగ్ మెషిన్.ఈ మెషీన్ లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే .దీనిని టిఫిన్ బాక్స్ పరిమాణంలో మడతపెట్టవచ్చు.ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ ను మీరు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
ఈ వాషింగ్ మెషీన్ ను ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.ఈ పోర్టబుల్ ఫోల్డబుల్ మెషిన్ ఫ్లిప్‌కార్ట్ లో రూ.9,999 కి బదులుగా 52% తగ్గింపు తర్వాత రూ.4,799కి మాత్రమే విక్రయించ బడుతోంది.
మీకు కావాలంటే, మీరు EMI లో కూడా కొనుగోలు చేయవచ్చు.వాషింగ్ మెషీన్ బట్టలు ఉతకడానికి 15 నిమిషాలు మాత్రమే పడుతుంది.ఈ ఆటోమేటిక్ మెషీన్ లో టచ్ కంట్రోల్ సదుపాయం అందించబడింది.
దీన్ని సులభంగా ఆపరేట్ చేయడానికి ఒక బటన్ కూడా ఇవ్వబడింది.ఇందులో మీరు ఒకేసారి 5 జతల బట్టలు ఉతకవచ్చు.
పైగా లైట్ వెయిట్ కలిగి ఉంటుంది.ఇది ముఖ్యంగా చదువుకుంటున్న మహిళలు అలాగే ఉద్యోగాలు చేసే మహిళలను ఉద్దేశించి రూపొందించబడినది.
టెక్నో ఆటోమేటిక్ పోర్టబుల్ ఫోల్డబుల్ వాషింగ్ మెషిన్ అని నెట్టింట్లో వెతికితే దీని డీటెయిల్స్ దొరుకుతాయి.