అమెరికాను వణికిస్తోన్న మంకీపాక్స్.. తొలి మరణం నమోదు, బైడెన్ యంత్రాంగం అలర్ట్

అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ వణికిస్తోంది.ఈ క్రమంలో అక్కడ తొలి మంకీపాక్స్ మరణం నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Us Reports First Monkeypox Death In Los Angeles , Monkeypox, Texas Public Health-TeluguStop.com

లాస్ ఏంజెల్స్ నగరానికి చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్లే అతను మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.

దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.లాస్స్ ఏంజెల్స్ కౌంటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్పందిస్తూ.

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో ఆ వ్యక్తి మరణానికి కారణం తెలిసిందని తెలిపారు.సదరు రోగి ధి నిరోధక శక్తిని కోల్పోయి ఆసుపత్రిలో చేరాడని.

అంతకుమించి ఇతర సమాచారం తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ .దేశంలోని మంకీపాక్స్‌ కేసులను ట్రాక్ చేస్తోందని, అమెరికాలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కారణంగా ఎవరూ చనిపోలేదని అధికారులు చెబుతున్నారు.లాస్ ఏంజెల్స్ కౌంటీ అధికారులు, సీడీసీతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.

కాగా.టెక్సాస్ పబ్లిక్ హెల్త్ అధికారులు ఆగస్ట్ 30న కూడా మంకీపాక్స్‌తో బాధపడుతోన్న వ్యక్తి మరణించినట్లు తెలిపారు.ఈ కేసులోనూ రోగి వ్యాధి నిరోధక శక్తి విఫలమైంది.అయితే అతని మరణానికి మంకీపాక్స్ ఎలాంటి పాత్ర పోషించిందో తెలుసుకునే పని జరుగుతోంది.

సీడీసీ గణాంకాల ప్రకారం.ప్రపంచంలోనే అత్యధిక మంకీపాక్స్ కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి.

ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 21,985 మంకీపాక్స్‌ కేసులు వున్నాయి.కాలిఫోర్నియాలో అత్యధికంగా 4,300 కేసులు నమోదయ్యాయి.

పరిస్ధితి తీవ్రత దృష్ట్యా రాబోయే వారాల్లో దేశవ్యాప్తంగా ఎల్‌జీబీటీక్యూ ప్రైడ్ ఫెస్టివల్స్‌లో టీకాల సంఖ్యను పెంచుతామని అధికారులు చెబుతున్నారు.

Telugu Control, Losangeles, Monkeypox, Texaspublic, Monkeypoxlos, Africa-Telugu

మంకీపాక్స్ అంటే?

మంకీపాక్స్ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ.ఇదికూడా కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి తుంపర్ల ద్వారా సోకుతుంది.

వ్యాధి సోకిన వారిని తాకినా.మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉంది.

ఇది శరీరంలోకి పూర్తిగా విస్తరించడానికి 6 నుంచి 13 రోజులు పడుతుంది.ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు.

మంకీపాక్స్ లక్షణాలు:జ్వరం, తలనొప్పి, వాపులు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట మంకీపాక్స్ లక్షణాలు.జ్వరం వచ్చే సమయంలో చర్మంపైన దద్దుర్లు, బొబ్బర్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది.

ఇవి సాధారణంగా అరిచేతులు, అరిపాదాల్లో వస్తుంటాయి.దీని ద్వారా విపరీతమైన దురద లేదా నొప్పి కలుగుతాయి.

ఒక్కోసారి మచ్చలు కూడా ఏర్పడవచ్చు.ఈ లక్షణాలు 14 నుంచి 21 రోజుల్లో బాధితుడిలో బయటపడతాయి.

ఇలాంటి సందర్భాల్లో ఓ వ్యక్తి నుంచి మరోవ్యక్తికి వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.ఈ వ్యాధిని అంతం చేయడానికి ఖచ్చితమైన చికిత్స లేదని సీడీసీ వెల్లడించింది.

అయితే స్మాల్పాక్స్ వ్యాక్సిన్, యాంటీవైరల్స్ వంటి ఔషధాలు వాడొచ్చని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube