సీపీఐ రామకృష్ణ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేస్తుంటే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని సీపీఐ రామకృష్ణ విమర్శించారు.
విశాఖలో అభివృద్ధి అనేది ఒక రాత్రిలో జరగలేదని పేర్కొన్నారు.స్టీల్ ప్లాంట్ ఇంకా కోర్టు వచ్చిన తర్వాత విశాఖ అభివృద్ధి జరిగిందని మంత్రులు ఇది గుర్తు పెట్టుకోవాలని తెలిపారు.
కాగా ఇప్పుడు మంత్రులే విశాఖను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే రీతిలో హైకోర్టు తీర్పుతో అమరావతి అంశం ముగిసింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మూడు రాజధానులు అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి రైతులు చేపడుతున్న మహాపాదయాత్ర పై మంత్రులు రెచ్చగొట్టే రీతిలో మాట్లాడటం సరికాదని విమర్శించారు.ఇదే సమయంలో లేపాక్షి భూములను సీఎం జగన్ మేనమామ కుమారుడు కొంటున్నారని వెంటనే ఆ భూములను రైతులకు ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేయడం జరిగింది.