ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో ఒక సినిమా సక్సెస్ సాధిస్తే తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.ఈ సినిమాల ఫలితాలు హీరోలతో పాటు హీరోల అభిమానులను కూడా బాధిస్తున్నాయి.
సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే సినిమా విడుదలైన ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లు ఊహించని స్థాయిలో తగ్గుతున్నాయి.అయితే అదే సమయంలో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ అవుతుంటే మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి.
స్టార్ హీరోలు చేస్తున్న తప్పులే ఈ విధంగా జరగడానికి కారణమని నెటిజన్లు భావిస్తున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తిపరిచే సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో స్టార్ హీరోలు ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి యూత్ కూడా పోకిరి, జల్సా సినిమాలు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లకు వచ్చి చూశారు.ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ ఉండటం వల్లే ఈ సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి.
టాలీవుడ్ హీరోలు కాంబినేషన్ కంటే కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కంటెంట్ ఉంటే చిన్న సినిమాలైనా సంచలనాలు సృష్టించడం సాధ్యమేనని ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి.
కొంతమంది హీరోలు కథలో వేలు పెట్టడం వల్ల కూడా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇండస్ట్రీలో విమర్శ ఉంది.
టాలీవుడ్ హీరోలు ఈ విషయాలను అర్థం చేసుకుంటే మాత్రమే పరిస్థితి మారే అవకాశం అయితే ఉంటుంది.అప్పటి కథలలో ఏముందో ఇప్పటి కథలలో అదే మిస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ దిశగా నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం హీరోల కెరీర్ ప్రమాదంలో పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్స్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.