పవన్ ప్రకటనపై టీడీపీ లో ఆందోళన ? ఓట్ల చీలికపై వైసీపీ ఆశలు ?

రాబోయే ఎన్నికల నాటికి జనసేనతో ఖచ్చితంగా పొత్తు కుదురుతుందని, రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు జనసేన విషయంలో ఆశలు పెట్టుకుంటూ వచ్చింది.దీనికి తగ్గట్టుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం టిడిపి తో పొత్తుకు తాము సిద్దమే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండేవారు.

 Concerned About Pawan's Statement In Tdp Ycp S Hopes On Split Votes , Pawan Kal-TeluguStop.com

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం  తనకు ఇష్టం లేదని చెబుతూ పరోక్షంగా పొత్తులకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చారు.ఇక అంతకు ముందు నుంచి జనసేనతో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.

కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జీలను నియమించకుండా,  జనసేనకు కేటాయించేందుకు బాబు సిద్ధమయ్యారు.బిజెపితో జనసేన, టిడిపి  జత కడుతుందని అంత భావిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నిన్న పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి, వైసీపీలతో పొత్తు పెట్టుకునేదే లేదని , మూడో ప్రత్యామ్నాయం అవసరమని పవన్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో టిడిపికి తాను మద్దతు ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేనని పవన్ ప్రకటించారు.
 

Telugu Ap, Chandrababu, Jagan, Janasenani, Pawan Kalyan, Tdp, Ysrcp-Politics

ఈ ప్రకటనపై టిడిపిలో ఆందోళన మొదలైంది.ఒంటరిగా 2024 ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే ఖచ్చితంగా 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని, అప్పుడు టిడిపి ఖాయమనే ఆందోళన ఇప్పుడు చంద్రబాబులో సైతం ఉంది.అంతేకాదు వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఖచ్చితంగా జనసేన టిడిపిలు చీల్చితే మళ్లీ వైసీపీకి అధికారం దక్కుతుందనే టెన్షన్ టిడిపిలో ఉండగా , ఈ పరిణామాలు వైసీపీలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లు టీడీపీ, జనసేన చీల్చితే తమకు మళ్లీ అధికారం దక్కడం ఖాయం అనే లెక్కల్లో ఏపీ అధికార పార్టీ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube