'NTR30'కు ఆల్ సెట్.. ఈ నెలలోనే లాంఛింగ్.. డేట్ ఫిక్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో నందమూరి అభిమానులు ఖుషీగా ఉన్నారు.

 Interesting Buzz On Ntr30 Launching Date-TeluguStop.com

అయితే ఇది మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేయలేక పోయారు.
అందుకే తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.ఇప్పటికే NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.
అయితే సినిమాను అనుకున్న సమయానికి సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోతున్నారు.

దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటూ అడిగి అడిగి విసిగిపోయారు అనే చెప్పాలి.అయినా కూడా మేకర్స్ నుండి ఎలాంటి స్పందన లేదు.

అయితే తాజాగా ఎన్టీఆర్ 20వ సినిమా లాంచింగ్ కూడా డేట్ ఫిక్స్ చేసారని లేటెస్ట్ గా ఒక బజ్ వినిపిస్తుంది.

Telugu Buzz Ntr, Jr Ntr, Koratala Siva, Ntr, Young Tiger Ntr-Movie

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.ఈ సినిమాను ఈ నెలలోనే స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారని.ఆగష్టు 31న లాంచింగ్ డేట్ గా ఫిక్స్ చేసారని అంటున్నారు.

మరి ఇది కూడా నిజమో కాదో తెలియదు కానీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అండ్ యువసుధ బ్యానర్ ల వారు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

చూడాలి ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube