సీతారామం ఎంత తెస్తే హిట్..!

దులర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా సీతారామం.ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారు.

 Seetha Ramam Pre Release Theatrical Business Details Seetha Ramam, Dular Salman-TeluguStop.com

కాశ్మీర్ మంచు పర్వాతాల్లో మైనస్ డిగ్రీల చలిలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిపారు.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమకథగా వస్తున్న సీతారామం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు తెలుస్తుంది.సినిమా వరల్డ్ వైడ్ గా 18.70 కోట్ల బిజినెస్ జరిగిందట.నైజాం లో 5 కోట్లు బిజినెస్ చేయగా సీడెడ్ 2 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లు బిజినెస్ చేసింది.ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 0.70 కోట్లు బిజినెస్ చేసిన సీతారామం సినిమా ఓవర్సీస్ లో 2.5 కోట్లు ఇతర భాషల్లో 1.50 కోట్లు బిజినెస్ చేసింది. సీతారామం హిట్ అనిపించుకోవాలంటే 19 కోట్ల టార్గెట్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది.

అయితే సినిమాకు వచ్చిన బక్ చూస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి.ఆల్రెడీ మహానటితో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన దుల్కర్ సల్మాన్ సీతారామం తో మరింత క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

కమర్షియల్ గా సక్సెస్ లు లేకపోయినా కంటెంట్ పరంగా ది బెస్ట్ అనిపించుకునే డైరక్టర్ హను రాఘవపుడి ఈసారి కమర్షియల్ గా కూడా సక్సెస్ కొట్టేలా ఉన్నాడని అంటున్నారు.మరి సీతారామం సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలంటే మరో రోజు వెయిట్ చేయాల్సిందే.

చిత్రయూనిట్ మాత్రం సినిమా రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ తో పాటుగా క్రేజీ హీరోయిన్ రష్మిక కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.

 ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ మళాయళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube