ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ నుంచి సునీల్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల*

కమీడియన్‌గా, హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Comedian Sunil's Look Poster From Tees Maar Khan :aadi Saikumar, Dr Nagam Tirup-TeluguStop.com

లవ్‌లీ హీరో ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా *తీస్ మార్ ఖాన్* అనే చిత్రం రాబోతోంది.ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.

ఈ చిత్రం *ఆగస్ట్ 19న* విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి.వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది.

సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు.సునీల్ ఈ చిత్రంలో చక్రి అనే పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు.తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సునీల్ సీరియస్‌గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు.

ఇక ఈ చిత్రంతో మరోసారి సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ లేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు.స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్.

ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు.

మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

*

నటీనటులు

ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : విజన్ సినిమాస్, డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ, ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : యాళ్ల తిర్మల్ రెడ్డి, మ్యూజిక్ : సాయి కార్తీక్, ఎడిటర్ : మణికాంత్, సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి , పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube